Audi Q3: మూడు సంవత్సరాల తర్వాత మార్కెట్‌లోకి వస్తున్న ఆడి క్యూ3.. ధర ఎంతంటే?
భారతదేశంలో ఇది మెర్సిడెస్ GLA, BMW X1లతో నేరుగా పోటీపడుతుంది. ప్రస్తుత మోడల్ భారతదేశంలో ధర రూ. 45.24 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. కానీ కొత్త మోడల్ కొంచెం ఖరీదైనదిగా ఉండవచ్చని భావిస్తున్నారు.
- By Gopichand Published Date - 05:05 PM, Wed - 11 June 25

Audi Q3: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తన కొత్త ఆడి క్యూ3 (Audi Q3)ని ఆవిష్కరించనుంది. ఈ కంపెనీ జూన్ 16న దీనిని పరిచయం చేయనుంది. 3వ తరం Q3ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయనున్నారు. లాంచ్‌కు ముందే కొత్త మోడల్ టీజర్ చిత్రాలను విడుదల చేశారు. ఇందులో దాని డిజైన్ అద్భుతంగా కనిపిస్తుంది. ఒక వైరల్ చిత్రంలో దీని A-పిల్లర్, ఫ్రంట్ లుక్ కనిపిస్తుంది. అలాగే మరొక చిత్రంలో దీని కొత్త DRLలు కనిపిస్తున్నాయి. 2022లో ఆడి Q3ని భారతదేశంలో లాంచ్ చేశారు. ఇప్పుడు సుమారు 3 సంవత్సరాల తర్వాత కొన్ని పెద్ద మార్పులతో ఈ కారును పరిచయం చేస్తున్నారు.
ఇంజన్- పవర్
పనితీరు కోసం కొత్త Audi Q3లో 2-లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. ఇది సుమారు 190hp పవర్, 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. ఇందులో క్వాట్రో ఆల్-వీల్-డ్రైవ్ సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ ఇంజన్ అన్ని వాతావరణ పరిస్థితులలో మెరుగైన పనితీరును అందిస్తుంది. భారతదేశంలో ఇది మెర్సిడెస్ GLA, BMW X1లతో నేరుగా పోటీపడుతుంది. ప్రస్తుత మోడల్ భారతదేశంలో ధర రూ. 45.24 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. కానీ కొత్త మోడల్ కొంచెం ఖరీదైనదిగా ఉండవచ్చని భావిస్తున్నారు.
Also Read: Cooking Tips: వంట చేసేటప్పుడు మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా?
కొత్త మార్పులు
కొత్త ఆడి Q3 బాహ్య రూపంలో మార్పులు కనిపించవచ్చు. దీని ముందు భాగంలో కొత్త గ్రిల్, బానెట్, బంపర్, ఫాగ్ ల్యాంప్ సౌకర్యం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో LED హెడ్‌ల్యాంప్‌లు కూడా కనిపిస్తాయి. ఈసారి కొత్త మోడల్ రూపం మరింత పదునైనదిగా ఉంటుంది. ఇందులో కొత్త అలాయ్ వీల్స్ కనిపిస్తాయి. అంతేకాకుండా ఇంటీరియర్ గురించి చెప్పాలంటే.. కారులో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే సిస్టమ్ లభిస్తుంది. అలాగే ఇందులో కనెక్టెడ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది. కొత్త మోడల్ డిజైన్ Q6 e-ట్రాన్‌తో సమానంగా ఉంటుందని భావిస్తున్నారు.