HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Harley Davidson Is Going To Launch Its Cheapest Bike

Harley-Davidson: హార్లే-డేవిడ్‌సన్ నుంచి త‌క్కువ ధ‌ర‌కే బైక్‌.. ఎంతంటే?

హార్లే-డేవిడ్‌సన్ అంటే ఇప్పటివరకు ధనవంతుల విలాసవంతమైన, శక్తివంతమైన బైక్‌ల బ్రాండ్ అనే భావన ఉండేది.

  • Author : Gopichand Date : 03-08-2025 - 5:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harley-Davidson
Harley-Davidson

Harley-Davidson: హార్లే-డేవిడ్‌సన్ (Harley-Davidson) అంటే ఇప్పటివరకు ధనవంతుల విలాసవంతమైన, శక్తివంతమైన బైక్‌ల బ్రాండ్ అనే భావన ఉండేది. అయితే ఈసారి ఆ నమ్మకాన్ని మార్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. హై-ఎండ్ మోడళ్లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హార్లే ఇప్పుడు కొత్త తరహా వ్యూహంతో యువ రైడర్లను ఆకర్షించేందుకు ‘స్ప్రింట్’ అనే కొత్త మోడల్‌ను విడుదల చేయబోతోంది. ఇది బ్రాండ్ చరిత్రలో ఒక కీలకమైన మలుపు కానుంది.

అత్యంత చౌకైన హార్లే: ధర, ఫీచర్లు

వార్తా నివేదికల ప్రకారం.. ఈ కొత్త స్ప్రింట్ బైక్ ధర సుమారు $6,000 (సుమారు ₹5 లక్షలు) ఉండవచ్చని అంచనా. ఒకవేళ ఈ ధర నిజమైతే ఇది ఇప్పటివరకు హార్లే-డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లలో అత్యంత సరసమైన బైక్‌గా నిలుస్తుంది. ఈ ధరతో హార్లే మొదటిసారిగా మధ్యతరగతి, యువ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ బైక్ కోసం కంపెనీ ఒక సరికొత్త ఆర్కిటెక్చర్‌ను రూపొందించింది. భవిష్యత్తులో రాబోయే అనేక కొత్త మోడళ్లకు ఇదే పునాది కానుంది. తద్వారా కంపెనీ బడ్జెట్ సెగ్మెంట్‌లో స్థిరపడాలని చూస్తోంది.

బడ్జెట్ బైక్ సెగ్మెంట్‌లో రెండో ప్రయత్నం

హార్లే-డేవిడ్‌సన్ తక్కువ ధర బైక్‌తో మార్కెట్‌లోకి రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో భారత్ వంటి దేశాల కోసం ప్రత్యేకంగా ‘స్ట్రీట్ 750’ అనే ఎంట్రీ-లెవల్ బైక్‌ను కంపెనీ లాంచ్ చేసింది. అది భారతదేశంలోనే తయారైంది. కానీ స్ట్రీట్ 750 ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అమ్మకాలు తక్కువగా ఉండటంతో కంపెనీ ఆ మోడల్‌ను నిలిపివేయవలసి వచ్చింది. స్ట్రీట్ 750 అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి స్ప్రింట్ ద్వారా బడ్జెట్ సెగ్మెంట్ వినియోగదారులను ఆకర్షించేందుకు ఎక్కువ మందికి చేరువయ్యేందుకు హార్లే మళ్లీ ప్రయత్నిస్తోంది.

Also Read: MLC Kavitha : నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న కవిత

‘స్ప్రింట్’ బైక్ ఆవిష్కరణ ఎప్పుడు?

హార్లే-డేవిడ్‌సన్ ఈ కొత్త బైక్‌ను మొదట 2025 EICMA మోటార్‌సైకిల్ షోలో ప్రదర్శించనుంది. ఆ తర్వాత కొద్ది వారాలకే ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నారు. ఈ బైక్ బడ్జెట్ సెగ్మెంట్‌లో విజయం సాధిస్తే, హార్లే బ్రాండ్ కేవలం ధనవంతులకే పరిమితం కాకుండ యువ రైడర్లకూ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రయత్నం హార్లే చరిత్రలో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చి, కంపెనీ భవిష్యత్తును మార్చగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • auto news
  • Automobiles
  • Harley New Bike 2025
  • Harley Sprint
  • Harley-Davidson
  • Harley-Davidson Bike

Related News

Car

ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

సాధారణంగా ఆటోమొబైల్ కంపెనీలు ఏప్రిల్ 1 నుండి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటిస్తుంటాయి. ముడి సరుకుల ధరలు పెరగడం, పన్నులు లేదా ఇతర ఖర్చుల వల్ల ఇలా జరుగుతుంది.

  • Tyres

    టైర్ల‌పై ఉన్న నంబర్ల అర్థం తెలుసా? ఇది మీ భద్రతకు చాలా ముఖ్యం!

  • Overheating

    మీ బైక్ ఇంజన్ ఓవర్‌హీట్ అవుతుందా?

  • Maruti Victoris

    ఈనెల‌లో కారు కొనేవారికి గుడ్ న్యూస్‌!

Latest News

  • విడాకులు తీసుకున్న మ‌రో టీమిండియా క్రికెట‌ర్!

  • ఈ దేశాల్లో బంగారు నాణేలు చలామణి!

  • Mumbai Airport : నూతన అధ్యాయానికి నాంది పలికిన ముంబై ఎయిర్పోర్ట్

  • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

  • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

Trending News

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd