మీ వాహనంపై టోల్ బకాయిలు ఉన్నాయా? అయితే రిస్క్‌లో పడినట్లే!
వాహన యజమానులు ఇప్పుడు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే ఫాస్ట్‌ట్యాగ్‌లో ఎప్పుడూ సరిపడా బ్యాలెన్స్ ఉంచుకోవడం. ఎటువంటి ఈ-నోటీసులనైనా నిర్లక్ష్యం చేయకండి.
- Author : Gopichand
Date : 22-01-2026 - 3:50 IST
Published By : Hashtagu Telugu Desk
Vehicle Transfer: మీరు మీ వాహనాన్ని అమ్మాలని చూస్తున్నా లేదా దాని ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను పునరుద్ధరించుకోవాలని అనుకుంటున్నా ఇకపై అజాగ్రత్తగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. టోల్ ప్లాజా బకాయిలు చెల్లించకుండా ఎటువంటి ముఖ్యమైన పనులు జరగవని కేంద్ర ప్రభుత్వం రోడ్డు నిబంధనలలో పెద్ద మార్పు చేస్తూ స్పష్టం చేసింది. వాహనం బదిలీ అవ్వాలన్నా, ఫిట్‌నెస్ లేదా పర్మిట్ రావాలన్నా బకాయిలు ఉండకూడదు. దీని కోసం రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖ ‘సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 2026’లో సవరణలు చేసింది.
ప్రభుత్వం నిబంధనలను ఎందుకు మార్చింది?
దేశవ్యాప్తంగా ‘బారియర్-ఫ్రీ టోల్ సిస్టమ్’ (అడ్డంకులు లేని టోల్ విధానం) అమలు చేసే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిని మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) సిస్టమ్ అని పిలుస్తారు. ఈ విధానంలో వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. ఫాస్ట్‌ట్యాగ్ (FASTag), నంబర్ ప్లేట్లను గుర్తించే ANPR కెమెరాలు, AI సాంకేతికత ద్వారా టోల్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో టోల్ రికార్డ్ అయినప్పటికీ చెల్లింపులు జరగడం లేదు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఈ సమస్యను అరికట్టడానికే కొత్త నిబంధనలను తీసుకువచ్చారు.
టోల్ బకాయిలను క్లియర్ చేయడం ఎందుకు ముఖ్యం?
కొత్త నిబంధనల ప్రకారం.. మీ వాహనంపై ఏదైనా టోల్ ప్లాజా బకాయి ఉంటే మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) లభించదు. NOC లేనిదే వాహనాన్ని ఇతరుల పేరు మీదకు బదిలీ చేయడం సాధ్యం కాదు. అంతేకాకుండా వాహనాన్ని వేరే రాష్ట్రంలో లేదా జిల్లాలో రిజిస్టర్ చేయడం, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రెన్యూవల్ చేయడం, కమర్షియల్ వాహనాల పర్మిట్లు తీసుకోవడం వంటి పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.
‘అన్‌పెయిడ్ యూజర్ ఫీజు’ (Unpaid User Fee) – కొత్త నిర్వచనం
సవరించిన నిబంధనలలో ‘అన్‌పెయిడ్ యూజర్ ఫీజు’ అనే కొత్త పదాన్ని చేర్చారు. అంటే ఏదైనా వాహనం నేషనల్ హైవే గుండా వెళ్లినట్లు ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్‌లో రికార్డ్ అయ్యి, నిర్దేశించిన టోల్ మొత్తం జమ కాకపోతే దానిని నేరుగా బకాయిగా పరిగణిస్తారు. ఇటువంటి కేసుల్లో ఇకపై ఎటువంటి మినహాయింపు ఉండదు.
Also Read: మీ దగ్గర రూ. 2000 నోట్లు ఉన్నాయా? అయితే ఇలా ఉపయోగించండి!
ఫామ్ 28లో మార్పులు
వాహన బదిలీకి అవసరమైన ఫామ్ 28లో కూడా ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పుడు వాహన యజమాని తన వాహనంపై ఏదైనా టోల్ బకాయి ఉందో లేదో ఈ ఫామ్‌లో స్పష్టంగా పేర్కొనాలి. బకాయి ఉంటే దాని పూర్తి వివరాలను అందించడం తప్పనిసరి. అయితే డిజిటల్ ప్రక్రియను ప్రోత్సహిస్తున్నందున ఫామ్ 28లోని ముఖ్యమైన భాగాలు ఇకపై ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా జారీ చేయబడతాయి.
ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) సస్పెండ్ అయ్యే ప్రమాదం
టోల్ బకాయి ఉండి కూడా చెల్లించకపోతే వాహన యజమానికి ముందుగా ఈ-నోటీస్ (e-notice) పంపుతారు. ఆ తర్వాత కూడా డబ్బు జమ చేయకపోతే ఫాస్ట్‌ట్యాగ్‌ను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. దీనితో పాటు వాహనానికి సంబంధించిన ఇతర జరిమానాలు, చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు.
2026లో ఏం మారబోతోంది?
2026లో బారియర్-ఫ్రీ టోలింగ్ సిస్టమ్‌ను అమలు చేయడం ప్రభుత్వ ప్రాధాన్యత అని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే తెలిపారు. ఇది అమలులోకి వస్తే టోల్ వసూలు ఖర్చు 15 శాతం నుండి దాదాపు 3 శాతానికి తగ్గుతుంది. దీనివల్ల ట్రాఫిక్ జామ్‌లు తగ్గి, ప్రయాణం వేగంగా, సులభంగా మారుతుంది.
వాహన యజమానులు ఏం చేయాలి?
వాహన యజమానులు ఇప్పుడు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే ఫాస్ట్‌ట్యాగ్‌లో ఎప్పుడూ సరిపడా బ్యాలెన్స్ ఉంచుకోవడం. ఎటువంటి ఈ-నోటీసులనైనా నిర్లక్ష్యం చేయకండి. వాహనాన్ని అమ్మేముందు ట్రాన్స్ ఫర్ చేసేముందు లేదా ఫిట్‌నెస్ రెన్యూవల్ చేసుకునే ముందు టోల్ బకాయిలు ఏవైనా ఉన్నాయేమో ఒకసారి సరిచూసుకోండి. లేదంటే మీ ముఖ్యమైన పనులు నిలిచిపోవచ్చు.