Ducati motorcycles: డుకాటీ బైక్‍ల ధరల పెంపు.. అప్పటి నుంచే ధరలు పెంపు..!
డుకాటీ (Ducati) గురించి మనందరికీ తెలుసు. ఈ కంపెనీ ఇటలీకి చెందిన ప్రీమియం స్పోర్ట్స్ బైక్ తయారీదారు. మీరు స్పోర్ట్స్ బైక్ ప్రియులా.. మీరు కూడా డుకాటి (Ducati) బైక్‌లను కొనాలని చూస్తున్నారా..? అయితే.. మీరు మీ కలను సాకారం చేసుకోవాలనుకుంటే దానికి ఇదే ఉత్తమ సమయం. ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లో Ducati తన అన్ని బైక్‌ల ధరలను పెంచబోతోంది.
- Author : Gopichand
Date : 20-12-2022 - 1:20 IST
Published By : Hashtagu Telugu Desk
డుకాటీ (Ducati) గురించి మనందరికీ తెలుసు. ఈ కంపెనీ ఇటలీకి చెందిన ప్రీమియం స్పోర్ట్స్ బైక్ తయారీదారు. మీరు స్పోర్ట్స్ బైక్ ప్రియులా.. మీరు కూడా డుకాటి (Ducati) బైక్‌లను కొనాలని చూస్తున్నారా..? అయితే.. మీరు మీ కలను సాకారం చేసుకోవాలనుకుంటే దానికి ఇదే ఉత్తమ సమయం. ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లో Ducati తన అన్ని బైక్‌ల ధరలను పెంచబోతోంది. పెరిగిన ధరలు జనవరి 1, 2023 నుండి అమలులోకి వస్తాయి. ఈ పెరుగుదల శాతాన్ని కంపెనీ వెల్లడించలేదు.
ఇటాలియన్ సూపర్‌బైక్ తయారీదారు డుకాటికి చెందిన అన్ని మోడళ్ల మోటార్ సైకిళ్ల ధరలు జనవరి 1 నుంచి భారత్‌లో పెరగనున్నాయి. కంపెనీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. అయితే ధర ఎంత పెరుగుతుందో మాత్రం చెప్పలేదు. డుకాటి ఇండియా తన మొత్తం శ్రేణి మోటార్‌సైకిళ్ల ధరలు జనవరి 1, 2023 నుండి పెరుగుతాయని ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ కొంత కాలంగా ఖర్చును భరిస్తోందని, అయితే ముడిసరుకు, ఉత్పత్తి, లాజిస్టిక్స్‌కు సంబంధించిన ఖర్చులు పెరగడం వల్ల ధరలను పెంచాల్సి వచ్చిందని పేర్కొంది.
Also Read: Patna Railway Station: పాట్నా రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు
డుకాటి బైక్‌ల జాబితాను పరిశీలిస్తే.. కంపెనీ ప్రస్తుతం అనేక ప్రీమియం బైక్‌లలో Diavel V4, Panigale V4 R, Multistrada V4 Rally, Streetfighterలను కలిగి ఉంది. డుకాటి మూడు కొత్త మోటార్‌సైకిల్ మోడల్‌లను కూడా పరిచయం చేసింది. డుకాటీ ఇటీవల డెసర్ట్‌ఎక్స్ (Ducati DesertX) పేరిట అడ్వెంచర్ బైక్‍ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ బైక్‍కు నాలుగు రైడింగ్ మోడ్స్, పవర్ మోడ్స్ ఉంటాయి. డుకాటీ డెసర్ట్‌ఎక్స్ ఎక్స్ షోరూమ్ ధర రూ.17.91 లక్షలుగా ఉంది. ఇప్పటికే ఈ బైక్ బుకింగ్స్ మొదలయ్యాయి. వచ్చే నెల డెలివరీలు ప్రారంభమవుతాయని డుకాటీ వెల్లడించింది.