Citroen Aircross Xplorer: భారత్ మార్కెట్‌లోకి మరో ఎస్‌యూవీ.. ధర కూడా తక్కవే!
ఎయిర్‌క్రాస్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్‌లో రెండు అద్భుతమైన ప్యాకేజీల ఎంపిక కూడా ఉంది. దీని స్టాండర్డ్ ప్యాక్ ధర రూ. 24,000, ఐచ్ఛిక ప్యాక్ ధర రూ. 51,700, ఇందులో డ్యూయల్-పోర్ట్ అడాప్టర్‌తో వెనుక సీటు ఉంటుంది.
- By Gopichand Published Date - 11:09 AM, Tue - 5 November 24

Citroen Aircross Xplorer: సిట్రోయెన్ ఇండియా తన ప్రసిద్ధ ఎయిర్‌క్రాస్ SUV పరిమిత ఎడిషన్ ఎక్స్‌ప్లోరర్ (Citroen Aircross Xplorer)ను భారతీయ కార్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్ ప్రారంభ ధర రూ.8.49 లక్షలు. ఈ కొత్త ఎడిషన్‌లో కంపెనీ చాలా, మరియు ప్రీమియం ఫీచర్లను పొందుపరిచింది. ఇప్పుడు మునుపటి కంటే మెరుగ్గా కనిపిస్తోంది. కొత్త ఎడిషన్ కస్టమర్లకు నచ్చుతుందని కంపెనీ పేర్కొంది. కొత్త అప్‌డేట్‌లు ఈ SUV శైలి, పనితీరు రెండింటినీ మెరుగుపరచడంలో సహాయపడతాయి.
కొత్త సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ రెండు వేరియంట్‌లలో పరిచయం చేశారు. ఇందులో ప్లస్, మ్యాక్స్ వేరియంట్‌లు ఉన్నాయి. ఇది ప్రామాణిక ధర కంటే రూ.24,000 ఎక్కువ. ప్రస్తుతం ఎయిర్‌క్రాస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.8.49 లక్షలు. కాగా ప్లస్ వేరియంట్ ధర రూ.9.99 లక్షలుగా నిర్ణయించారు.
ఎయిర్‌క్రాస్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్‌లో రెండు అద్భుతమైన ప్యాకేజీల ఎంపిక కూడా ఉంది. దీని స్టాండర్డ్ ప్యాక్ ధర రూ. 24,000, ఐచ్ఛిక ప్యాక్ ధర రూ. 51,700, ఇందులో డ్యూయల్-పోర్ట్ అడాప్టర్‌తో వెనుక సీటు ఉంటుంది. ఈ కొత్త ఎడిషన్‌లో ఎయిర్‌క్రాస్ SUV బాడీ డీకాల్స్, హుడ్ గార్నిష్, ఖాకీ కలర్ ఇన్సర్ట్‌ల రూపంలో అనేక కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను పొందింది. ఈ ఖాకీ పెయింట్ రంగు ఈ కొత్త ఎడిషన్‌కు బలమైన, ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది.
Also Read: Former Minister Satyanarayana: ఏపీలో విషాదం.. మాజీ మంత్రి కన్నుమూత
దీని ఇతర ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే.. డాష్ కెమెరా, ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేస్, రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ ప్యాకేజీతో సహా అనేక కొత్త ఫీచర్లు కూడా ఇందులో చేర్చబడ్డాయి. కారులో ఉన్నవారు ప్రీమియం ఇన్-క్యాబిన్ అనుభవాన్ని పొందుతారని కంపెనీ పేర్కొంది. ఎయిర్‌క్రాస్ ఎక్స్‌ప్లోరర్ లిమిటెడ్ ఎడిషన్ భారతదేశంలోని సిట్రోయెన్ 86 లా మైసన్ షోరూమ్‌లో అమ్మకానికి ఉంది. సిట్రోయెన్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు.
సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ అనేది 5 సీట్ల SUV. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ 2 గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన EBD, 3 పాయింట్ సీట్ బెస్ట్, EPS వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ SUVకి 200mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ఈ కారు ఒక లీటరుకు 18.25 kmpl మైలేజీని అందిస్తుంది. కొత్త ఎడిషన్ కస్టమర్లకు నచ్చుతుందని కంపెనీ భావిస్తోంది. భారతదేశంలో ఇది మారుతి బ్రెజ్జాతో నేరుగా పోటీపడుతుంది.