Brixton Crossfire 500 XC: ఈ బైక్‌పై భారీగా డిస్కౌంట్.. ధర ఎంతంటే?
ధర తగ్గింపు తర్వాత, క్రాస్‌ఫైర్ 500 ఎక్స్‌సీ ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్, కేటీఎం అడ్వెంచర్‌లకు గట్టి పోటీ ఇస్తుంది. పవర్, హార్డ్‌వేర్ పరంగా ఇది అనేక ప్రీమియం బైక్‌లను అధిగమిస్తుంది.
- By Gopichand Published Date - 08:15 PM, Wed - 27 August 25

Brixton Crossfire 500 XC: భారత బైక్ మార్కెట్‌లో మిడిల్‌వెయిట్ సెగ్మెంట్ వేడెక్కుతోంది. ఈ క్రమంలో బ్రెక్స్‌టన్ మోటార్‌సైకిల్స్ తమ స్క్రాంబ్లర్ మోడల్ క్రాస్‌ఫైర్ 500 XC (Brixton Crossfire 500 XC) ధరను తగ్గించి సంచలనం సృష్టించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్, కేటీఎం 390 అడ్వెంచర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బియర్ 650 వంటి బైక్‌లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. బ్రిక్స్‌టన్ క్రాస్‌ఫైర్ 500 ఎక్స్‌సీ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 4.92 లక్షలుగా ఉంది. ఇంతకు ముందు దీని ధర రూ. 5.19 లక్షలు. అంటే కొనుగోలుదారులకు ఇప్పుడు రూ. 27,499 ఆదా అవుతుంది. నవంబర్ 2024లో లాంచ్ అయిన ఈ బైక్ ఇప్పుడు ఈ సెగ్మెంట్‌లో మరింత ఆకర్షణీయమైన ఎంపికగా మారింది.
బ్రిక్స్‌టన్ క్రాస్‌ఫైర్ 500 ఎక్స్‌సీ- ఇంజిన్, పవర్
ఈ బైక్‌లో 486సీసీ లిక్విడ్-కూల్డ్, పారలెల్-ట్విన్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ సుమారు 47 బీహెచ్‌పీ పవర్, 43 ఎన్‌ఎం టార్క్ అందిస్తుంది. ఇది ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇది హైవేలు, ఆఫ్-రోడ్ పరిస్థితులలో సమతుల్య పనితీరును అందిస్తుంది.
హార్డ్‌వేర్, సస్పెన్షన్
ధర తగ్గించినప్పటికీ బైక్ హార్డ్‌వేర్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో పూర్తిగా సర్దుబాటు చేయగల కేవైబీ యూఎస్‌డీ ఫోర్క్స్, రియర్ మోనోషాక్, 19-17 అంగుళాల స్పోక్ వీల్స్, ఫ్యాక్టరీలో అమర్చిన పిరెల్లి స్కార్పియన్ ర్యాలీ ఎస్‌టీఆర్ టైర్లు ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక జె. జువాన్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. వీటితో పాటు బోష్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ కూడా ఉంది.
Also Read: Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు!
ఫీచర్లు, టెక్నాలజీ
బైక్‌లో యూఎస్‌బీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఇది రైడింగ్ అనుభవాన్ని ఆధునికంగా మారుస్తుంది. దాని ఫీచర్లు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. అడ్వెంచర్ బైక్ ప్రియులకు ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
బ్రిక్స్‌టన్ క్రాస్‌ఫైర్ 500 ఎక్స్‌సీ పోటీ
ధర తగ్గింపు తర్వాత, క్రాస్‌ఫైర్ 500 ఎక్స్‌సీ ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్, కేటీఎం అడ్వెంచర్‌లకు గట్టి పోటీ ఇస్తుంది. పవర్, హార్డ్‌వేర్ పరంగా ఇది అనేక ప్రీమియం బైక్‌లను అధిగమిస్తుంది. అయితే భారతదేశంలో బ్రిక్స్‌టన్ అమ్మకాలు, సర్వీస్ నెట్‌వర్క్ ఇంకా పరిమితంగా ఉంది. ఇది దాని లభ్యతపై ప్రభావం చూపవచ్చు.