HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ysrcp Rk Roja Sensational Comments On Tdp Leaders

Roja Sensational Comments: జ‌గ‌న్ అన్న బ్ల‌డ్‌లో భ‌యం అనేది లేదు.. టీడీపీకి రోజా స్ట్రాంగ్ వార్నింగ్‌!

వాళ్లు అర్థం చేసుకోవాల్సింది ఒక్క‌టే మా నాయ‌కుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌యం అనేది ఆయ‌న బ్ల‌డ్‌లో లేదు. ఆయ‌న వెన‌క ప‌నిచేస్తున్నా మేమంద‌రం కూడా జ‌గ‌న్ అన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం.

  • Author : Gopi Date : 19-12-2024 - 11:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rk Roja Sensational Comments
Roja Sensational Comments

Roja Sensational Comments: ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఆరు నెల‌లు పూర్తైంది. ఈ స‌మ‌యంలోనే ప్ర‌తిపక్ష వైసీపీ నాయకులు టీడీపీ కూట‌మి పాల‌న‌పై విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టారు. ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ నాయ‌కులు టీడీపీ కూట‌మిపై ప్రెస్ మీట్లు పెట్టి మ‌రీ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్‌, మాజీ మంత్రి రోజా త‌న‌దైన మాట‌ల‌తో (Roja Sensational Comments) టీడీపీ కూట‌మిపై విరుచుప‌డ్డారు.

మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ ఆరు నెల‌ల కాలంలో ఈ నియోజ‌క‌వ‌ర్గానికి వాళ్లు ఏం చేశారు అని అడిగితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్‌గా ఉన్న లీడ‌ర్లు పేద ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసే లీడ‌ర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్ట‌డం వాళ్ల పొలాల‌కు అడ్డంగా గోడ‌లు క‌ట్ట‌డం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అలాగే వాళ్ల మీద త‌ప్పుడు కేసులు పెట్టి పోలీసుల‌తో వాళ్ల‌ని బెదిరించ‌డం ఇలాంటి నీతిమాలిన చ‌ర్య‌లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Also Read: Greenfield Expressway: సాధారణ ఎక్స్‌ప్రెస్‌వే- గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేల‌కు మ‌ధ్య తేడా ఇదే!

కూటమి ప్రభుత్వం EVM లను మానేజ్ చేసి, దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది – @RojaSelvamaniRK pic.twitter.com/JvLnYCPVhW

— greatandhra (@greatandhranews) December 18, 2024

వాళ్లు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ కానీ లేదా మిగ‌తా వాగ్దానాలు కానీ ఏవీ నేర‌వేర్చ‌కుండా ఏ విధంగా ప్ర‌జ‌ల‌ను మోసం చేశారో ప్ర‌జ‌లంద‌రికీ ఇప్పుడే అర్థ‌మైపోయింది. కానీ దుర‌దృష్టం ఏంటంటే తాగే నీళ్ల ద‌గ్గ‌ర నుంచి ప్ర‌జ‌ల‌కు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే స‌చివాల‌యం, ఆర్‌బీకే సెంట‌ర్ అన్ని కూడా ఇక్క‌డ లీడ‌ర్లు వాళ్లు ల్యాండ్ ఇచ్చి క‌ట్టించి అన్ని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం గ‌తంలో 14 సంవ‌త్స‌రాలు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు నాయుడు అప్పుడు ఏం చేయ‌లేదు ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చాక ఇప్పుడు ఏం చేయ‌కుండా వాళ్లు ఫెయిల్యూర్ అయిన విష‌యాన్ని క‌ప్పి పుచ్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

టీడీపీ నాయ‌కులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడ‌ర్ల‌ని వేధించ‌డం, భ‌యాభ్రాంతుల‌ను చేయాల‌న్న ఆలోచ‌న‌తో ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. వాళ్లు అర్థం చేసుకోవాల్సింది ఒక్క‌టే మా నాయ‌కుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌యం అనేది ఆయ‌న బ్ల‌డ్‌లో లేదు. ఆయ‌న వెన‌క ప‌నిచేస్తున్నా మేమంద‌రం కూడా జ‌గ‌న్ అన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవ‌రికీ భ‌య‌ప‌డే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మేమ‌వ్వ‌రం త‌ప్పు చేయ‌లేదు. అయిదేళ్లు కూడా ప్ర‌జ‌ల‌కు మంచే చేశాం. నియోజ‌క‌వ‌ర్గాలు అన్ని అభివృద్ధి చేశాం. ఈరోజు మీరు మోసంతో అధికారంలోకి వ‌చ్చారు. ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వ‌చ్చారు. ఏ విధంగా సూప‌ర్ సిక్స్‌లు అంటూ ప్ర‌జ‌ల‌ను మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుప‌డాలి మేము సిగ్గు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ఈరోజు టీడీపీ వాళ్ల‌ను హెచ్చ‌రిస్తున్నాం. ఇలాంటి ప‌నికి మాలిన కార్య‌క్ర‌మాలు మ‌రోసారి చేస్తే స‌హించేది లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • CM Chandrababu
  • EVMs
  • Janasena
  • RK Roja
  • roja sensational comments
  • tdp leaders
  • YCP vs TDP
  • ys jagan
  • ysrcp

Related News

CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఉద్యోగులు వినూత్నంగా ఆలోచనలు చేసేలా ప్రోత్

  • CM Chandrababu

    CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • TDP

    TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • government-gives-green-signal-for-prosecution-of-kodali-nani

    Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd