Sajjala Ramakrishna Reddy: నటిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సజ్జల ఏమన్నారంటే..?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఓ నటిపై మరియు ఆమె కుటుంబంపై తప్పుడు కేసులు బనాయించినట్లు కొన్ని మీడియా సంస్థలు ఆరోపించినట్లు సజ్జల పేర్కొన్నారు. ఆ ఆరోపణలని ఆయన ఖండించారు.
- Author : Praveen Aluthuru
Date : 27-08-2024 - 9:31 IST
Published By : Hashtagu Telugu Desk
Sajjala Ramakrishna Reddy: తనపై వచ్చిన ఆరోపణలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముంబై నటిపై జరిగిన వేధింపుల ఆరోపణలను సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. తనపై అసత్యపు ప్రచారాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఓ నటిపై మరియు ఆమె కుటుంబంపై తప్పుడు కేసులు బనాయించినట్లు కొన్ని మీడియా సంస్థలు ఆరోపించినట్లు సజ్జల పేర్కొన్నారు. ఆ ఆరోపణలని ఆయన ఖండించారు. కాగా ఎన్డీయే ప్రభుత్వం మ్యానిఫెస్టోలో అమలు చేయని హామీలు, పెరుగుతున్న హింస, హత్యలు, ఆస్తుల విధ్వంసం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రచారంలో భాగమే నాపై అసత్యపు ప్రచారాలు అని ఆయన అన్నారు. ఈ మేరకు తనపై ఆరోపణలు చేసిన మీడియాపై చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా స్థానిక మీడియా కథనాలు అల్లిస్తోందని సజ్జల మండిపడ్డారు. ముంబై నటికి వేధింపులు, సజ్జల నుండి సహాయం” అనే శీర్షికతో వచ్చిన కథనం పూర్తిగా అబద్ధమని ఆయన కొట్టిపారేశారు. సోషల్ మీడియా మరియు ఇతర ఛానెల్‌ల ద్వారా ఈ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినందుకు గానూ అధికార పార్టీపై ఆయన మండిపడ్డారు.
Also Read: Raviteja Mr Bacchan : మిస్టర్ బచ్చన్ ఓటీటీ లోకి వచ్చేస్తుందా..?