Sharmila : కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వైఎస్ షర్మిల
- Author : Latha Suma
Date : 20-04-2024 - 12:22 IST
Published By : Hashtagu Telugu Desk
Nomination of YS Sharmila: కాంగ్రెస్(Congress)పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నామినేషన్ వేశారు. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్(Nomination) దాఖలు చేశారు. నామినేషన్‌కు మొదట షర్మిల ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. షర్మిలతో పాటు వైఎస్ సునీత ప్రార్థనల్లో పాల్గొన్నారు. నామినేషన్ పత్రాలను ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అనంతరం ఇడుపులపాయ నుంచి ర్యాలీగా వెళ్లి కడప కలెక్టరేట్‌లో ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. కడప జిల్లా ప్రజలు ఎన్నికల్లో మంచి తీర్పు ఇవ్వాలని షర్మిల కోరారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్రానికి అభివృద్ధి సాధ్యం కావాలంటే అది కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యం అవుతుందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల ఓవైపు కూటమి నేతలు, మరోవైపు వైసీపీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
Read Also: Chandrababu Birthday : చంద్రబాబు బర్త్‌డే.. విద్యార్థి నేత నుంచి సీఎం దాకా స్ఫూర్తిదాయక ప్రస్థానం
కాగా, నేడు షర్మిల ఎక్స్‌లో పోస్టును షేర్ చేస్తూ.. ‘‘ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో, దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని, న్యాయం కొరకు, విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారిని, వైఎస్ వివేకానందరెడ్డి గారిని మరిచిపోలేని ప్రజలు, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తుంది మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ’’ అని పేర్కొన్నారు.