Sharmila : చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో ప్రయోజనమే లేదు: షర్మిల
సీఎం చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనలు చూస్తుంటే అయిననూ పోయి రావలే హస్తినకు అన్నట్టుంది అని ఎద్దేవా చేశారు.
- By Latha Suma Published Date - 04:37 PM, Wed - 17 July 24

Chandrababu Delhi Tour: ఏపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) తాజా ఢిల్లీ పర్యటన(Delhi Tour)పై మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనలు చూస్తుంటే అయిననూ పోయి రావలే హస్తినకు అన్నట్టుంది అని ఎద్దేవా చేశారు. ఎన్డీయే కూటమిలో పెద్దన్న పాత్రలో ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు… ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్టు? ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నట్టు? అని చంద్రబాబును ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి నెల రోజులు దాటినా… మోడీతో గానీ, ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు? గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పెద్దలతో చెప్పించగలిగారా? పోలవరం ప్రాజెక్టుకు నిధులపై స్పష్టత ఇచ్చారా? రాజధాని నిర్మాణంపై కేంద్రం ఇచ్చే సాయం ఏంటో చెప్పగలిగారా? అంటూ నిలదీశారు. ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న..దాటాక బోడీ మల్లన్న..ఇదే బీజేపీ(BJP) సిద్ధాంతం అన్ని షర్మిల విమర్శలు గుప్పించారు.