HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Sharmila Fire On Kutami Govt

YS Sharmila: కూటమి ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు!

టీటీడీ (TTD) నిధులతో టీటీడీనే గుడులు కడితే ఎవరికీ అభ్యంతరం ఉండదని షర్మిల స్పష్టం చేశారు. అయితే, టీటీడీ నిధులతో కట్టే దేవాలయాలకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమోషన్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.

  • By Gopichand Published Date - 01:55 PM, Wed - 1 October 25
  • daily-hunt
YS Sharmila
YS Sharmila

YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో దళితవాడల్లో మౌలిక సదుపాయాల కల్పన లోపం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మతపరమైన వ్యవహారాల్లో జోక్యంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమపై జరుగుతున్న మతపరమైన విష ప్రచారాన్ని ఆమె గట్టిగా ఖండించారు.

దళితవాడల్లో సమస్యలపై హైకోర్టు ప్రస్తావన

దళిత విద్యార్థులు చదువుకునే చోట 228 మందికి ఒకే బాత్‌రూమ్ ఉన్నట్టు 2025 జూలైలో రాష్ట్ర హైకోర్టు పేర్కొన్న విషయాన్ని షర్మిల ఈ సందర్భంగా ప్రస్తావించారు. “కనీసం రోడ్లు, డ్రైనేజీ కూడా SC, ST కాలనీలలో లేవని ప్రశ్నించడం నేరమా? దళితవాడల్లో గుడులు కట్టడానికి ముందు ప్రభుత్వ దృష్టి స్థానికంగా బడులు, మౌలిక వసతుల కల్పన మీద ఉండాలని చెప్పడం తప్పా?” అని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రాథమిక అవసరాలను విస్మరించి, గుడుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

మత ప్రమోషన్ తగదు

టీటీడీ (TTD) నిధులతో టీటీడీనే గుడులు కడితే ఎవరికీ అభ్యంతరం ఉండదని షర్మిల స్పష్టం చేశారు. అయితే, టీటీడీ నిధులతో కట్టే దేవాలయాలకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమోషన్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. “ఒక మతానికి పెద్ద దిక్కులా ముఖ్యమంత్రి మాట్లాడకూడదు. ఆయన ప్రకటించే నిర్ణయాలు అన్ని మతాలకు సమానంగా ఉండాలి. కూటమి ప్రభుత్వంలో, బీజేపీతో కలిసున్న సీఎం గారు మిగతా మతాలకు అభద్రతాభావం కలిగించకూడదు” అని ఆమె హెచ్చరించారు.

Also Read: Yashasvi Jaiswal: అరుదైన ఘ‌న‌త సాధించిన య‌శ‌స్వి జైస్వాల్‌!

బీజేపీ-RSSపై షర్మిల ధ్వజం

తాము హిందూ ధర్మానికి, హిందువులకు వ్యతిరేకులమని చూపించే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై, వ్యక్తిగతంగా తనపై బీజేపీ, RSS మత ఛాందసవాదులు విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. “నా వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ఉద్దేశ్యాన్ని మత పిచ్చి RSS, బీజేపీ వాదులు ఆపాదిస్తున్నారు. మత రాజకీయాలు చేసి లబ్ధి పొందేందుకు బీజేపీ, RSS చేస్తున్నవి నీచ రాజకీయాలు,” అని ఆమె తీవ్రంగా విమర్శించారు.

సర్వమత సమ్మేళనమే కాంగ్రెస్ సిద్ధాంతం

కాంగ్రెస్ పార్టీ హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదని, సర్వమత సమ్మేళనం తమ సిద్ధాంతమని షర్మిల స్పష్టం చేశారు. “రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళం. ఒక మతానికి ఒక న్యాయం, మరో మతానికి అన్యాయం అనేది కాంగ్రెస్ సిద్ధాంతం కాదు” అని ఆమె అన్నారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపితే, వెంటనే సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేసింది తానేనని ఆమె గుర్తు చేశారు.

ప్రభుత్వానికి సవాల్

ప్రజల పక్షాన తమ డిమాండ్‌లో మంచిని వెతకకుండా చంద్రబాబు సమాధానం చెప్పకుండా, కుహనా మేధావులతో మాట్లాడించడం సిగ్గుచేటు అని షర్మిల విమర్శించారు. “ప్రజల కోసం మేము మాట్లాడితే, మతం కోసం RSS, బీజేపీ మాట్లాడుతుంది. ఎవరు మత పిచ్చిగాల్లో, ఎవరు మత విద్రోహులో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే మేము లేవనెత్తిన అంశాల మీద ప్రభుత్వ పరంగా సమాధానం ఇవ్వండి” అని ఆమె డిమాండ్‌తో తన ప్రకటనను ముగించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • CM Chandrababu
  • Kutami Govt
  • telugu news
  • ys sharmila

Related News

Godavari Pushkaralu 2027

Godavari Pushkaralu 2027 : గోదావరి పుష్కరాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ ..15 నిమిషాల్లో బయటకి.!

రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు నిర్వహించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని.. ఆగమ, వైదిక పండితులు సూచించిన నేపథ్యంలో.. రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్‌ల ఏర్పాట్లు కోసం కసరత్తు ప్రారంభించారు. ఈ పుష్కరాలకు 7 నుంచి 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. పుష్కరాల నిర్వహణకు రూ. 5,704 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భారతదేశంలో

  • Cbn

    Andhrapradesh : ఏపీ సమగ్రాభివృద్ధి కోసం కొత్త స్కెచ్.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

  • Pawan Amaravati

    Kutami Government : కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది – పవన్

  • Nara Lokesh

    Nara Lokesh: విద్యాశాఖ మంత్రి సమక్షంలో పసిమొగ్గల ఆనందం!

  • Sand Supply

    Sand Supply : ఆంధ్ర నుంచి తెలంగాణ కు యథేచ్ఛగా ఇసుక

Latest News

  • Sugar Syrup: తీపి వంటకాల కోసం సరైన పద్ధతిలో పాకం తయారు చేయడం ఎలా?

  • Kohli Ignored Gambhir: కోహ్లీ- గంభీర్ మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయా? వీడియో వైర‌ల్‌!

  • Russian Oil Supplies: గయానా నుంచి చమురు దిగుమతులు.. 17,700 కి.మీ సుదీర్ఘ ప్రయాణం!

  • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

  • Maruti Suzuki: మారుతి సుజుకి తీసుకురాబోయే కొత్త కార్ల లిస్ట్ ఇదే!

Trending News

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

    • Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?

    • Elon Musk: ఎలాన్ మ‌స్క్ కొడుకుకి భారతీయ శాస్త్రవేత్త పేరు!

    • Samantha Raj Nidimoru : వివాహ బంధంతో ఒక్కటైన సమంత – రాజ్!…ఫోటోలు వైరల్..

    • AIDS Day : ఎయిడ్స్ కేసుల్లో టాప్ లో ఏపీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd