HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagan New Scheme For Marriage

YS Jagan : యువ‌తుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్‌…!

ఏపీ ప్ర‌భుత్వం పేదింటి యువ‌తుల‌కు శభ‌వార్త చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు పెండింగ్ లో ఉన్న పెళ్లి కానుక నిధులు విడుదల చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

  • Author : hashtagu Date : 27-11-2021 - 3:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఏపీ ప్ర‌భుత్వం పేదింటి యువ‌తుల‌కు శభ‌వార్త చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు పెండింగ్ లో ఉన్న పెళ్లి కానుక నిధులు విడుదల చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీంతో పాటు పెళ్లి కానుక ప్రోత్సాహ‌కాల‌ను కూడా ప్ర‌భుత్వం పెంచింది.ఇది వ‌చ్చే ఏడాది శ్రీరామ‌న‌వ‌మి నుంచి అమ‌లుకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌ లో ఉన్న పెళ్లి కానుకల కోసం నిధులు విడుదల చేసింది. త్వరలోనే ఈ డబ్బు అకౌంట్లలో జమ కానున్నాయి. గ్రామాల్లో ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ తర్వాత అర్హత సాధించిన వారికి డబ్బులు జ‌మ‌కానున్న‌ట్లు అధికారులు తెలిపారు. మ‌రోవైపు పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లలకు మరింత సాయం చేసేందుకు జగన్‌ సర్కార్ అడుగులు వేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇఛ్చినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెల్లిస్తున్న ప్రోత్సాహకాన్నిపెంచింది.దీనికి వైఎస్సార్‌ పెళ్లి కానుకగా నామ‌క‌ర‌ణం చేసి అందజేసేందుకు ప్ర‌భుత్వం సిద్ద‌మ‌వుతుంది. గతంలో ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు పెళ్లి కానుక కింద అందజేశారు. ఇప్పుడు పెంచిన ప్రోత్సాహకం ప్రకారం వైఎస్సార్‌ పెళ్లి కానుక కింద అర్హులైన వారందరికీ లక్ష రూపాయలు రానున్నాయి.

ఎస్సీ,ఎస్టీ కులాంతర వివాహాలకు ఇస్తున్న రూ.75 వేలను ఇప్పుడు రూ.1.20 లక్షలు చేశారు. బీసీ యువతులకు ఇస్తున్న రూ.35 వేలను రూ.50 వేలకు.. కులాంతర వివాహాలు చేసుకొనేవారికి రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. మైనార్టీలకు రూ.50 నుంచి రూ.లక్షకు.. దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు ప్రోత్సాహకాలను పెంచారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల పెళ్లి కానుకను కూడా జగన్ సర్కార్ పెంచింది. వారికి రూ.20 వేల నుంచి రూ.లక్షకు చేరింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు ఆగ్రవర్ణ పేదలు ఎవరైనా భవన నిర్మాణ కార్మికులగా పనిచేస్తూ, కార్మిక శాఖలో నమోదు చేసుకుంటే వారింట్లో ఆడపడుచులకు పెళ్లి కానుక పథకాన్ని అమలు చేయ‌నున్నారు. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికు కుటంబాలకు సాయం చేస్తున్నా.. వారు అవగాహన లోపంతో సాయానికి దూరమవుతున్నార‌ని అధికారులు అంటున్నారు.

భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకొనే వారి సంఖ్య తక్కువగా ఉన్నార‌ని… ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ప‌దుల సంఖ్య‌లో మాత్రమే పెళ్లి కానుక దరఖాస్తు చేసుకున్న‌ట్లు స‌మాచారం. భవన నిర్మాణ కార్మికులు దగ్గర్లోని ఆసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి వెళ్లి సంబంధిత పత్రాలు, తగిన రుసుం చెల్లించి గుర్తింపు కార్డు పొందవచ్చని ఆధికారులు చెబుతున్నారు. గుర్తింపు కార్డు వచ్చిన వారు పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తానికి రాష్ట్రంలో పెళ్లి కానుక ప‌థ‌కం తిరిగి ప్రారంభం కావ‌డంతో పెదింటి ఆడ‌పిల్ల‌ల త‌ల్లిదండ్రులకు కొంత చేదోడు వాదోడుగా డ‌బ్బులు ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP CM Jagan
  • ap marriage scheme
  • ys jagan

Related News

Vijay is following Jagan once again — Roja

Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

టీవీకే చీఫ్ విజయ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య మరో పోలికను తెచ్చారు మాజీ మంత్రి రోజా. శనివారం ఆమె తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయ్.. వైఎస్ జగన్‌ను ఫాలో అవుతున్నారని రోజా అన్నారు. తమిళనాడు ఎన్నికల సమయం నుంచి జరుగుతున్న ఘ

  • CM Chandrababu Naidu

    CM Chandrababu: ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

  • Rayalaseema is now 'Royal' Seema... Chandrababu's intriguing tweet!

    CBN: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్!

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

  • Nara Lokesh

    Nara Lokesh: లోకేశ్ ఆసక్తికర ట్వీట్..

Latest News

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

  • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

  • Venu Swamy: విజయ్-త్రిషపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd