HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagan Meets Nandigam Suresh In Guntur Jail Flays Govt

YS Jagan Guntur Tour: గుంటూరు జైలులో వైఎస్‌ జగన్‌, టీడీపీ రెడ్‌బుక్‌పైనే దృష్టి

YS Jagan At Guntur Jail: ఏపీలో దుర్మార్గ పాలన సాగుతోందన్నారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారని, ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, టీడీపీ అవలంబిస్తున్న ఇదే సాంప్రదాయం ఒక సునామీ అవుతుందని హెచ్చరించారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 11-09-2024 - 4:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Jagan Guntur Tour
YS Jagan Guntur Tour

YS Jagan Guntur Tour: గుంటూరు సబ్‌ జైలులో నిర్బంధంలో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్‌(Nandigam Suresh)కు సంఘీభావం తెలిపేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు వచ్చారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేరుగా జైలుకు వెళ్లి సురేష్‌ను కలిశారు. పర్యటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత నాయకుడిని అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై అక్రమ అభియోగాలు మోపారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. సురేశ్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వంపై  జగన్ (YS Jagan) మండిపడ్డారు. ఏపీలో దుర్మార్గ పాలన సాగుతోందన్నారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారని, ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, టీడీపీ అవలంబిస్తున్న ఇదే సాంప్రదాయం ఒక సునామీ అవుతుందని హెచ్చరించారు. టీడీపీ నేతలకు కూడా ఇదే గతి పడుతుందని సంచలన కామెంట్స్ చేశారు వైఎస్ జగన్. టీడీపీ రెడ్‌బుక్‌పైనే దృష్టి పెట్టిందని.. ప్రజా సమస్యలపై దృష్టి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ(TDP) కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు నందిగం సురేష్‌. గతంలో వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి తీవ్ర పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. నిరసనగా నందిగం సురేష్ సహా కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అప్పట్లో వారిపై కేసులు నమోదయ్యాయి.కాగా ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేయగా ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నందిగం సురేష్, దేవినేని అవినాష్ సహా ఇతర నాయకుల పిటిషన్లను తిరస్కరించింది.

Also Read: Palestine In UN : తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు సీటు.. ఇజ్రాయెల్ భగ్గు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • chandrababu
  • false case
  • guntur
  • jail
  • Nandigam Suresh
  • Red Book
  • tdp
  • telugu news
  • ys jagan

Related News

CM Chandrababu

CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అదృశ్యం కేసుపై న్యాయమైన విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మితో మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేస

  • TDP

    TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • government-gives-green-signal-for-prosecution-of-kodali-nani

    Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • Iran and the US sign peace agreement.

    US-Iran Peace Deal: శాంతి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు

  • Big alert for candidates: NEET 're-exam' date fixed.

    NEET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ డేట్ ఫిక్స్

Latest News

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd