AP Budget : ప్రజలను మభ్య పెట్టేందుకు పెట్టిన బడ్జెట్ ఇది : వైఎస్ జగన్
ప్రభుత్వం నడుపుతున్నప్పుడు అప్పులు చేయడం పథకాలు ఇవ్వడం సర్వసాధారణమేని అన్నారు. మా ప్రభుత్వం విఫలం కావాలనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు.
- By Latha Suma Published Date - 05:31 PM, Wed - 13 November 24

YS Jagan on AP Budget : వైఎస్ జగన్ ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టేందుకేనని కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌ను ఎన్నికలు అవ్వగానే ప్రవేశపెట్టాలి. కానీ వీళ్లు అలా చెయ్యలేదు. చిత్తశుద్ధి లేదు. 8 నెలలు అయిపోయాక.. బడ్జె్ట్ ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇక 4 నెలలు మాత్రమే ఉందని ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఆంతర్యం ఏమిటని జగన్ ప్రశ్నించారు. బడ్జెట్ ప్రవేశపెడితే, తన మోసాలూ, అబద్ధాలూ బయటకివి వస్తాయని చంద్రబాబుకి తెలుసు. అందుకే ఇన్నాళ్లూ ప్రవేశపెట్టలేదు.
ప్రజలు సూపర్ సిక్స్ గురించి అడుగుతారని తెలిసే, ఇలా సాగదీస్తూ వచ్చారు. పరిమితికి మించి వైఎస్‌ఆర్‌సీపీ అప్పులు చేసిందంటూ ప్రచారం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం నడుపుతున్నప్పుడు అప్పులు చేయడం పథకాలు ఇవ్వడం సర్వసాధారణమేని అన్నారు. మా ప్రభుత్వం విఫలం కావాలనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. వాళ్లు చెప్పే అబద్ధాలు కూడా అంతర్జాతీయ అంశంగా ప్రచారం చేస్తారని అన్నారు. రాష్ట్రం శ్రీలంక లా మారిందని ముందు చంద్రబాబు మాట్లాడతారని.. ఆ తరువాత పవన్ , పురందేశ్వరి కలిసి బాబుకి వత్తాసు పలుకుతారని ధ్వజమెత్తారు. ఓ పద్థతి ప్రకారం తమ ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేశారని మండిపడ్డారు.
Read Also: HYDRA : బతుకమ్మకుంటలో ఇండ్ల కూల్చివేతలు ఉండవు : హైడ్రా కమిషనర్