HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Young Minister And Gajapathinagaram Mla Kondapalli Srinivas Led The Tdp Formation Day Celebrations In North Andhra

Kondapalli Srinivas : గజపతి నగరంలో గర్జించిన పసుపు జెండా

స్థానిక టీడీపీ  నేతలతో స్వయంగా మాట్లాడిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas).. పార్టీ బలోపేతం కోసం ఎలా ముందుకు సాగాలనే దానిపై  దిశా నిర్దేశం చేశారు.

  • By Pasha Published Date - 05:14 PM, Sun - 30 March 25
  • daily-hunt
Gajapathi Nagaram Mla Kondapalli Srinivas Tdp Formation Day Celebrations North Andhra

Kondapalli Srinivas : యావత్ తెలుగు జాతికి గర్వకారణం తెలుగుదేశం పార్టీ. యావత్ తెలుగు జాతి గర్వించే సామాజిక యోధుడు అన్న ఎన్‌టీఆర్. ప్రజాసంక్షేమం కోసం ఆ మహనీయుడు ఏర్పాటు చేసిన రాజకీయ వేదికే టీడీపీ. తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. పల్లె నుంచి పట్నం దాకా జయహో టీడీపీ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. యువ మంత్రి, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాలు గ్రాండ్‌గా జరిగాయి. ఇందులో పెద్దసంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో పార్టీ జెండాను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

Also Read :Anam Mirza : సానియా మీర్జా సోదరి ‘దావతే రంజాన్’‌లో కాల్పుల కలకలం

మంత్రి పిలుపుతో.. అన్ని గ్రామాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాలు

స్థానిక టీడీపీ  నేతలతో స్వయంగా మాట్లాడిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas).. పార్టీ బలోపేతం కోసం ఎలా ముందుకు సాగాలనే దానిపై  దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలోనూ  టీడీపీ ఆవిర్భావ దినోత్సవాలను గ్రాండ్‌గా నిర్వహించాలని పార్టీ క్యాడర్‌కు మంత్రి సూచించారు. ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలు, నేతలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.  ఆయన పిలుపుతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాలను ఏర్పాటు చేశారు. తద్వారా పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు యత్నించారు. తాను హాజరు కాలేకపోయినా.. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించిన కార్యకర్తలు, నాయకులతో స్వయంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్  ఫోన్‌లో మాట్లాడారు. వారిని అభినందించారు. కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేతలు కూడా.. మంత్రి పిలుపుతో మళ్లీ లైన్‌లోకి వచ్చారు. టీడీపీ జెండాతో జనంలోకి వెళ్లడం మొదలుపెట్టారు.

Also Read :Jagga Reddy Movie: నాపై ఎన్నో కుట్రలు.. నా జీవిత పోరాటాన్ని సినిమాలో చూపిస్తా : జగ్గారెడ్డి

యావత్ ఉత్తరాంధ్రలో.. 

ఇక ఉత్తరాంధ్రలో ఇతర నాయకులు సైతం టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల రక్తదాన శిభిరాలు, సామూహిక అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సిక్కోలు నుంచి చిత్తూరు వరకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొన్నాయి. మంత్రులు సైతం తమ తమ నియోజకవర్గాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాగా, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సైతం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap govt
  • Gajapathi Nagaram
  • Gajapathi Nagaram MLA
  • Kondapalli Srinivas
  • North Andhra
  • tdp
  • tdp formation day
  • tdp mla

Related News

Rahul Vizagsteel

Rahul Gandhi : త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించబోతున్న రాహుల్ గాంధీ!

Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (విశాఖ ఉక్కు కర్మాగారం) ప్రైవేటీకరణ అంశం గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాం నుండి నేటి కూటమి ప్రభుత్వం వరకూ రాజకీయంగా చర్చనీయాంశమవుతూనే ఉంది.

  • Pawan Uppada

    Uppada Fishermen : ఉప్పాడ మత్స్యకారుల్లో ఆనందం నింపిన పవన్

  • Vkr Prajadarbar

    Prajadarbar : గన్నవరం నియోజకవర్గంలో నేడు యార్లగడ్డ సమక్షంలో ప్రజాదర్బార్

Latest News

  • Jagan : చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలి – జగన్ డిమాండ్

  • Terrorist : జైషే మహ్మద్ మహిళా వింగ్లో 5 వేల మంది మహిళలు

  • Andhrapradesh Govt : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ..డైరెక్టుగా ఇంటర్‌లో జాయిన్ త్వరలో లాస్ట్ డేట్!

  • Mopidevi Subrahmanyeshwara Swamy Temple : 50 కిలోల వెండితో పానపట్టం..మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హైదరాబాద్ భక్తుడి విరాళం

  • Rupe Value : రూపాయి మరింత పతనం

Trending News

    • Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా ఆట‌గాడు!!

    • India Squad: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భార‌త్ జ‌ట్టు ఇదే.. కెప్టెన్ ఎవ‌రంటే?

    • PM Modi AI Video: ప్ర‌ధాని మోదీ ఏఐ వీడియో.. ఇలా చేయ‌టం క‌రెక్టేనా?!

    • Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్.. ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

    • Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd