YCP Third List: వైసీపీ మూడో జాబితా నేడు ప్రకటించే అవకాశం..?
ఏపీ రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల్లో టికెట్ టెన్షన్ పెరిగిపోతుంది. అధికార వైసీపీ (YCP Third List)లో మార్పుల జాబితా గందరగోళానికి కారణమవుతోంది.
- By Gopichand Published Date - 09:17 AM, Thu - 11 January 24

YCP Third List: ఏపీ రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల్లో టికెట్ టెన్షన్ పెరిగిపోతుంది. అధికార వైసీపీ (YCP Third List)లో మార్పుల జాబితా గందరగోళానికి కారణమవుతోంది. మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న వైసీపీ మూడో జాబితా సిద్ధం చేసింది. గురువారం అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. ఇప్పటికే ప్రకటించిన రెండు జాబితాల్లో 38 స్థానాల్లో జగన్ అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేసి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాకిచ్చారు. నిన్నే మూడో జాబితా వస్తుందని ప్రచారం జరిగినా కొన్ని కారణాల వలన వాయిదా పడింది. దాదాపు 25 నుంచి 30 మందితో సిద్ధం చేసిన మూడోలిస్ట్‌ను నేడు రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.
ఇప్పటివరకు రెండు జాబితాలు ప్రకటించిన వైసీపీ.. 38 స్థానాల్లో ఇంఛార్జిల మార్పులు చేసింది. మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు, చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు. రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేశారు. అయితే మొదటి జాబితాలో ఎక్కడా కూడా ఎంపీ స్థానాలు ప్రకటించ లేదు. రెండో జాబితాలో మాత్రం మూడు ఎంపీ స్థానాల్లో మార్పులు చేసి షాక్ ఇచ్చారు.
Also Read: Fuel In Cuba: వామ్మో.. లీటర్ పెట్రోల్ ధర రూ.450.. ఎక్కడంటే..?
వైసీపీ నుంచి లోక్ సభ బరిలో కొందరు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా టాలీవుడ్ డైరెక్టర్ వి.వి.వినాయక్, కర్నూలు నుంచి గుమ్మనూరు జయరాం,విజయనగరం ఎంపీ అభ్యర్థిగా మజ్జి శ్రీనివాసరావు, అనకాపల్లి నుంచి అడారీ రమాదేవి, విశాఖ నుంచి బొత్స ఝాన్సీ రాణి, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్లని సీఎం జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరు నుంచి వైసీపీ కేడర్‌తో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 26 జిల్లాలను 5 డివిజన్లుగా విభజించి, జోన్ల వారిగా సమావేశాల్లో పాల్గొంటారు. నియోజకవర్గంలోని కేడర్ సమస్యలను పరిష్కరించి, అందరూ కలిసి పని చేసేలా దిశానిర్దేశం చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.