Y Not 160 : వైనాట్ పులివెందుల గర్జన వెనుక కొదమసింహం
చంద్రబాబు టార్గెట్ చేస్తే వ్యూహాలను మార్చడమే కాదు, లక్ష్యాన్ని ( Y Not 160)ముద్దాడుతారు అనే నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది.
- Author : CS Rao
Date : 03-08-2023 - 1:49 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ చేస్తే మామూలుగా ఉండదు. వ్యూహాలను మార్చడమే కాదు, లక్ష్యాన్ని ( Y Not 160)ముద్దాడుతారు అనే నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. వైనాట్ పులివెందుల మీద ఆయన కన్నేశారు. కొదమసింహలా ముందుకు వెళతానని చెబుతున్నారు. కడప పర్యటనకు వెళ్లిన ఆయన ఆ జిల్లాలోని ప్రజల మధ్య కొదమసింహంలా గర్జించారు. కుప్పం నియోజకవర్గం వైపు చూసిన జగన్మోహన్ రెడ్డికి మరుపురాని గిఫ్ట్ ఇస్తానంటూ హెచ్చరించారు. కడపలో టీడీపీ స్వీప్ చేసేలా పనిచేయాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. పులివెందుల నియోజకవర్గం టీడీపీ కైవసం అయ్యేలా వ్యూహాలకు చంద్రబాబు పదునుపెట్టారు.
వైనాట్ పులివెందుల మీద చంద్రబాబు టార్గెట్ ( Y Not 160)
ఒకప్పుడు కడప జిల్లా వైపు చూడ్డానికి ప్రత్యర్థి పార్టీలకు భయం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిని లేకుండా చంద్రబాబు చేయగలిగారు. సుదీర్ఘ రాజకీయ పోరాటం తరువాత రాజకీయ పరిస్థితులను మార్చేలా ప్రయత్నం చేశారు. ఒకప్పుడు ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలు వెళ్లడానికి సాహసం చేసే పరిస్థితి ఉండేది కాదు. క్రమంగా టీడీపీ ప్రభుత్వం హయాంలో ఓటర్లకు ధైర్యం నూరిపోసింది. స్వల్ప మోజార్టీతో స్వర్గీయ వైఎస్ అప్పట్లో ఎంపీగా బయటపడే పరిస్థితికి టీడీపీ తీసుకొచ్చింది. మళ్లీ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తరువాత పుంజుకుంది. గత ఎన్నికల్లోనూ పది స్థానాల్లో వైసీపీ స్వీప్ చేసింది. కానీ, ఇప్పుడు పరిస్థితి.( Y Not 160) మారింది.
పులివెందులతో సహా కడప జిల్లాలోని స్థానాలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ తరువాత వైఎస్ కుటుంబం గ్రాఫ్ పడిపోయిందని ప్రత్యర్థులు అంచనా వేస్తున్నారు. స్వయంగా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సుప్రీం కోర్టు వరకు తన తండ్రి మర్డర్ విచారణ కోసం వెళ్లారు. నిజాలను బయటపెట్టాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. క్లియర్ గా ఎంపీ అవినాష్, తాడేపల్లి కోట ప్రమేయం ఉందని సీబీఐ చెబుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి పరోక్ష ప్రమేయాన్ని కూడా సీబీఐ అనుమానించింది. కానీ, ఢిల్లీ బీజేపీ పెద్దల నీడన అరెస్ట్ లు లేకుండా తప్పించుకుంటున్నారని డాక్టర్ సునీత భావిస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడా తగ్గకుండా వివేకానందరెడ్డి హత్యలోని నిజాలను బయటపెట్టడానికి పోరాడుతున్నారు. సరిగ్గా ఈ పరిణామం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ నేరతత్త్వాన్ని బయటపెట్టిందని ప్రత్యర్థి పార్టీల భావన. అందుకే, ఈసారి ఎన్నికల్లో పులివెందులతో సహా కడప జిల్లాలోని స్థానాలు( Y Not 160) టీడీపీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ అంచనా వేసుకుంటోంది.
Also Read : India TV-CNX : ఏపీలో మళ్లీ YCP, తెలంగాణలో BRS! జాతీయ సర్వే మాయ!!
మాజీ మంత్రి వివేకా హత్య తదనంతరం పరిణామాలను కడప జిల్లా ప్రాజెక్టుల పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ప్రజలకు వివరించారు. ఆయన సభలకు కడప జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా జనం హాజరయ్యారు. వాళ్లను నుద్దేశించి మాడ్లాడుతూ కొదమసింహంలా పోరాడతానని క్యాడర్లో జోష్ నింపారు. సొంత బాబాయ్ ను హత్య చేసిన వాళ్లను నమ్మొద్దని పిలుపు నిచ్చారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కు గొడ్డలి పోటు, అమ్మకు విశాఖ పోటు, చెల్లెలకు తెలంగాణ పోటు గిప్ట్ గా ఇచ్చారని గుర్తు చేశారు. హత్య జరిగిన సమయంలో సీఎం ఉన్న తనపై ఆ నేరాన్ని మోపడం ద్వారా 2019 ఎన్నికల్లో గెలుపొందాడని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికైనా సీబీఐ బయటపెట్టిన నిజాలను తెలుసుకుని ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటర్ల ( Y Not 160) బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
Also Read : Priya Fix TDP : మాజీ మంత్రుల గుట్టురట్టు
వాస్తవంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానందరెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో రాజకీయంలో వివేకా బతికున్న రోజుల్లో ఆయనదే పైచేయి. ప్రతి ఇంటిలోని వాళ్లను పేర్లతో పిలిచే చనువు ఉందని చెబుతుంటారు. అందుకే, ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమంటూ టీడీపీ అంచనా వేస్తోంది. అక్కడి నేత బీటెక్ రవి సుదీర్ఘ కాలం వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయం చేశారు. టీడీపీ హయాంలో ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఈసారి ప్రత్యక్షర ఎన్నికల్లో వైఎస్ కుటుంబం మీద గెలవడంమే కాదు, మంత్రి పదవిని అధిరోహించాలని భావిస్తున్నారు. ఆ మేరకు వ్యూహాలను రచిస్తూ చంద్రబాబు అండదండలను తీసుకుంటున్నారు. అందుకే, వైనాట్ పులివెందుల ( Y Not 160) కాన్సెప్ట్ తో టీడీపీ ఎన్నిలకు దూకుడుగా వెళుతోంది.