HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Worlds Largest Renewable Energy Project In Ap

Davos : ఏపీలో ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు – నారా లోకేష్

Davos : “పర్యావరణ పరిరక్షణ – వాతావరణ ఉద్యమ భవిష్యత్” అనే అంశంపై స్వనీతి ఆధ్వర్యాన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

  • By Sudheer Published Date - 05:01 PM, Tue - 21 January 25
  • daily-hunt
Lokesh Davos 2 Day
Lokesh Davos 2 Day

Davos: ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలను తగ్గించి, వాతావరణంలో ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి క్లీన్ ఎనర్జీ ఒక్కటే ఏకైక పరిష్కార మార్గమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. దావోస్ బెల్వెడేర్ (Davos Belvedere) లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం(world economic forum conference) వేదికగా “పర్యావరణ పరిరక్షణ – వాతావరణ ఉద్యమ భవిష్యత్” అనే అంశంపై స్వనీతి ఆధ్వర్యాన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్వనీతి ఇనిషియేటివ్ సిఇఓ రిత్వికా భట్టాచార్య వ్యాఖ్యాతగా వ్యవహరించగా, జోర్డాన్ క్వీన్ డాక్టర్ రానియా అల్ అబ్దుల్లా, పోర్చుగల్ మాజీ ప్రధాని జోస్ మాన్యుల్ బరాసో, యునెస్కాప్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ మార్గా గ్యుయల్ సోలెర్, సెడ్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వికాస్ మెహతా, ఇండోనేషియా జాతీయాభివృద్ధి మంత్రి రచ్మట్ పంబుడి, ఇండికా ఎనర్జీ ప్రెసిడెంట్ డైరక్టర్ అర్సాద్ రజీద్, రెన్యు పవర్ జింక్ సిఇఓ వైశాలి నిగమ్ సిన్హా పాల్గొన్నారు.

Hydra Police Station : ఇదిగో హైడ్రా పోలీస్ స్టేషన్.. పరిశీలించిన కమిషనర్ ఏవీ రంగనాథ్

ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… 2023 ఇప్పటివరకు అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. అ ఏడాది పూర్వ పారిశ్రామిక సగటు కంటే 1.45°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రీన్ హౌస్ వాయు సాంద్రతలు 2022లో గరిష్టస్థాయికి చేరాయి, ఆ తర్వాత కూడా అది కొనసాగుతూనే ఉంది. గత 65సంవత్సరాల్లో ఎన్నడూ లేనివిధంగా సముద్రపు వేడి గరిష్టస్థాయికి చేరింది. 2022-23లో గ్లేసియర్ నష్టం రికార్డుస్థాయికి చేరింది. కేవలం స్విట్జర్లాండ్ లోనే రెండేళ్లలో హిమానీనద పరిమాణం 10% కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా పరివర్తన కోసం 2030నాటికి పునరుత్పాదక శక్తి, వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి 4ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయి.

2050నాటికి క్లీన్ హైడ్రోజన్ డిమాండ్ 125 – 585 ఎంటిపిఎ నడుమ ఉంటుంది. అప్పటికి పవర్ మార్కెట్ లో 50 నుంచి 65శాతంతో గ్రీన్ హైడ్రోజన్ పై చేయి సాధిస్తుంది. 2024లో గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ పరిమాణం $6.49 బిలియన్లను అధిగమించింది. 2032నాటికి ఇది సగటున 31శాతం పెరిగే అవకాశం ఉంది.

Dreams: కలలో కాకులు కనిపించాయా.. అయితే దాని అర్థం ఏంటో అది దేనికి సంకేతమో తెలుసా?

కార్బన్ తీవ్రతను 45శాతం తగ్గించేలా భారత్ చర్యలు

పారిస్ ఒప్పందంపై సంతకం చేసిన భారత్ కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తోంది. 2030 నాటికి కార్బన్ తీవ్రతను 45% తగ్గించేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సంప్రదాయ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తోంది. భారతదేశ నాన్ ఫాసిల్ 2024 నవంబర్ నాటికి ఇంధన సామర్థ్యం 205.52 గిగావాట్లకు చేరుకొని గత 8.5సంవత్సరాలతో పోలిస్తే 396శాతం పెరిగింది. ఇది మొత్తం ఇంధన సామర్థ్యంలో 42శాతం కంటే అధికంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సౌర శక్తిని ప్రోత్సహించడానికి భారతదేశం అంతర్జాతీయ సౌర కూటమి (ISA) సహ-స్థాపన చేసింది. విద్యుత్ చట్టం 2003లోని నిబంధనలకు లోబడి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పంపిణీ ప్రాజెక్టుల కోసం ఆటోమేటిక్ విధానంలో నూరుశాతం ఎఫ్ డిఐలను అనుమతిస్తోంది.

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఉక్కు, సిమెంట్, రసాయనాలు వంటి క్లిష్టమైన రంగాలను లక్ష్యంగా చేసుకుని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతిలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030నాటికి ఈ రంగంలో Rs.8 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి… 6లక్షలకు పైగా సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. సోలార్ పార్కుల అభివృద్ధికి కూడా భారత ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది.

England: భార‌త్‌తో తొలి టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్ర‌క‌టించిన ఇంగ్లండ్‌!

ఇందులో భాగంగా 12 రాష్ట్రాల్లో 500 MW లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో 500 సోలార్ పార్కులు మంజూరుచేసింది. సోలారైజింగ్ అగ్రికల్చర్, గ్రామీణ విద్యుదీకరణ కార్యక్రమాల కోసం PM-KUSUM వంటి కార్యక్రమాల ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, సౌరశక్తిని ప్రోత్సహిస్తోంది. సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫర్డబుల్ ట్రాన్స్‌పోర్టేషన్ (SATAT) లో భాగంగా కంప్రెస్డ్ బయో గ్యాస్ (సిబిజి) ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు చొరవ చూపుతోంది. ఆటోమోటివ్ ఇంధనంగా సిబిజిని వినియోగించేలా మార్కెట్ లో అందుబాటులోకి తెస్తోంది.

ఏపీలో అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు

డీకార్బనైజ్డ్ ఎకానమీకి బెంచ్‌మార్క్ ని సెట్ చేస్తూ సస్టయినబుల్ ఎనర్జీలో ప్రపంచ అగ్రగామిగా అవతరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. శిలాజేతర ఇంధన వనరుల నుండి 25గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో పునరుత్పాదక ఇంధనరంగంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది. కర్నూలు జిల్లాలోని 1 గిగావాట్ అల్ట్రా మెగా సోలార్ పార్కు వంటి ప్రముఖ ప్రాజెక్టులతోపాటు కేంద్రప్రభుత్వం ఇటీవల 4గిగావాట్ల సామర్థ్యం గల 4సోలార్ పార్కులను ఎపిలో ప్రకటించింది. సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలమైన ఫ్రేమ్‌వర్క్ ద్వారా ప్రయత్నాలు చేస్తోంది. హరిత ఆర్థిక వ్యవస్థతో పాటు సమగ్రమైన, స్వచ్ఛమైన ఇంధన పర్యావరణ వ్యవస్థను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రగతిశీల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల “ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ – 2024ను ప్రకటించారు.

160 GW పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షలమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సాధించాలన్నది మా లక్ష్యం. రాష్ట్రంలో 34 GW సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ పవర్ (PSP) ప్రాజెక్ట్‌ల కోసం 29 స్థానాలను గుర్తించాం. సోలార్, విండ్, సోలార్-విండ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్‌ల కోసం 80వేల ఎకరాల భూమిని ఎపి ప్రభుత్వం సర్వే చేసింది. జలవిద్యుత్ రంగంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌ల ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 5230 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ (IRESP)కి కలిగి ఉంది.

త్వరలో ఇది ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఒక్కొక్కటి 30 మెగావాట్ల సామర్థ్యంతో విశాఖపట్నం, కృష్ణపట్నంలో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్ లను ప్రతిపాదించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సామర్థ్య సూచిక (State Energy Efficiency Index SEEI)-2023 దేశంలో 2వ స్థానంలో నిలచి అత్యుత్తమ పనితీరును కనబరిచింది. 2030నాటికి 18 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. చంద్రబాబునాయుడు గారి సమర్థ నాయకత్వంలో పునురుత్పాదక శక్తిలో ఎపిని అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Davos
  • nara lokesh
  • The World Economic Forum
  • World's largest renewable energy project

Related News

Ap Egg

Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

Production of Eggs : మాంసం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో, పాల ఉత్పత్తిలో ఐదవ స్థానంలో, మరియు గేదెల ఉత్పత్తిలో ఆరవ స్థానంలో ఉందని దామోదర్ నాయుడు తెలిపారు

  • Heavy Rains

    Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • YSRCP's actions to tarnish the dignity of teachers are evil: Minister Lokesh

    Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

  • Nara Lokesh Pm Modi Yuvagalam Coffee Table Book Tdp Ap Govt

    Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ

  • Ap Universal Health Policy

    Universal Health Policy : యూనివర్సల్ హెల్త్ పాలసీ పూర్తి వివరాలు!

Latest News

  • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd