Dreams: కలలో కాకులు కనిపించాయా.. అయితే దాని అర్థం ఏంటో అది దేనికి సంకేతమో తెలుసా?
కలలో కాకి కనిపించడం అన్నది కొన్ని రకాల విషయాలకు సంకేతంగా భావించాలి అని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
- Author : Anshu
Date : 21-01-2025 - 3:27 IST
Published By : Hashtagu Telugu Desk
మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి.. అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని చెడ్డ కలలు. అయితే కలలో మనకు పక్షులు జంతువులు మనుషులు ఇలా చాలా రకాల వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి కలలో తరచుగా కాకి కనిపిస్తూ ఉంటుంది. కాకి తలపై తన్నినట్టు, కాకికి అన్నం పెట్టినట్టు ఇలా రకరకాల కలలు వస్తూ ఉంటాయి. మరి నిజానికి కాకి కలలో కనిపించడం మంచిదేనా అలా కనిపిస్తే అది దేనికి సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలలో కాకిని చూడటం అశుభంగా పరిగణించాలట. ఇది భారీ ప్రమాదాన్ని సూచిస్తుందని చెబుతున్నారు.
ఎవరి మరణవార్త అయినా వినే అవకాశం ఉందట. మీరు కలలో కాకిని చూస్తే, మీ జీవితంలో ఏదో మార్పు వస్తుందని అర్థం చేసుకోవాలట. వారి కర్మ ఫలితంగా ఏదో అనుభవిస్తున్నారని అంటున్నారు . కలలో కాకి కనిపిస్తే ఉదయాన్నే శని దేవుడిని దర్శించుకోవాలని చెబుతున్నారు. అలాగే మీ కలలో నల్లని వస్త్రాలు లేదా ఎక్కువగా నల్లని దుస్తులు ధరించే వ్యక్తి కనిపిస్తే, అది అనారోగ్యానికి సంకేతంగా పరిగణించాలట. తుఫాను లేదా ఇల్లు కూలిపోతున్నట్లు కలలు వస్తే అది దురదృష్టం నీడలా మీపై పడుతుందని అర్థం.
మీ జీవితంలో చాలా నష్టం ఉండవచ్చు అనడానికి సంకేతంగా భావించాలని చెబుతున్నారు. అలాగే కలలో చంద్రగ్రహణం లేదా సూర్య గ్రహణం కనిపించడం కూడా అశుభంగా భావించాలట. అలాంటి కల ఒక వ్యక్తి తన జీవితంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందనడానికి సూచన అని చెబుతున్నారు. కలలో అడవి జంతువులు వెంబడించే దృశ్యాలను చూడటం ప్రతికూల ఫలితాల సంకేతంగా భావించాలని చెబుతున్నారు.