HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >What Is Pm Vishwakarma Scheme 2 22 Lakh People In Ap Under This Scheme

PM Vishwakarma Scheme: పీఎం విశ్వకర్మ పథకం అంటే ఏమిటి? ఈ స్కీమ్ కింద ఏపీలో 2.22 ల‌క్ష‌ల మంది!

ఆంధ్రప్రదేశ్‌లోని అనేక శిక్షణ కేంద్రాలు వేలాది మందికి ప్రాథమిక నైపుణ్య శిక్షణను అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. శ్రీ టెక్నాలజీస్, ఎడుజాబ్స్ అకాడమీ, సింక్రోసర్వ్ గ్లోబల్ వంటి సంస్థలు ఈ శిక్షణ కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.

  • Author : Gopi Date : 24-07-2025 - 6:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Vishwakarma Scheme
PM Vishwakarma Scheme

ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 2.22 లక్షల మంది విజయవంతంగా నమోదు అయ్యారని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభ కరంద్లాజే వెల్లడించారు. ఈ పథకం కింద రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు. గురువారం లోక్‌సభలో ఎంపీలు కేశినేని శివనాథ్ (చిన్ని), బస్తిపాటి నాగరాజు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో మంత్రి ఈ వివరాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పీఎం విశ్వకర్మ పథకం అమలు, నిర్వహణ, ఇతర వివరాలపై ఈ ఇద్దరు ఎంపీలు ప్రశ్నించారు.

పీఎం విశ్వకర్మ పథకం – లక్ష్యాలు, అమలు

2023 సెప్టెంబర్ 17న ప్రారంభించబడిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం, చేతిపనులు చేసే సంప్రదాయ వృత్తుల కళాకారులు, చేతివృత్తుల వారు ఆర్థికంగా స్వయం సమృద్ధులు కావాలనే లక్ష్యంతో రూపొందించబడింది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కావడంతో, రాష్ట్రాలు లేదా జిల్లాల వారీగా నిధులు కేటాయించబడవు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం కింద ఇప్పటివరకు 21.63 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 2.22 లక్షల మంది విజయవంతంగా నమోదు అయ్యారు.

Also Read: Bengaluru Stampede: కర్ణాటక ప్రభుత్వం క‌ఠిన చ‌ర్య‌లు.. ఆర్‌సీబీపై నిషేధం?!

శిక్షణ కార్యక్రమాలు

బ్లాక్‌స్మిత్‌లు (లొహార్), గోల్డ్‌స్మిత్‌లు (సునార్), మేసన్‌లు (రాజ్ మిస్త్రీ) వంటి వృత్తులపై ప్రత్యేక లక్ష్యాలను ఏ శిక్షణ సంస్థకూ కేటాయించలేదు. అయితే, ఈ పథకంలో నమోదు అయిన ప్రతి లబ్ధిదారుడికి ప్రాథమిక నైపుణ్య శిక్షణ ఇవ్వాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని అనేక శిక్షణ కేంద్రాలు వేలాది మందికి ప్రాథమిక నైపుణ్య శిక్షణను అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. శ్రీ టెక్నాలజీస్, ఎడుజాబ్స్ అకాడమీ, సింక్రోసర్వ్ గ్లోబల్ వంటి సంస్థలు ఈ శిక్షణ కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఎన్‌టిఆర్ జిల్లాలో కూడా ప్రత్యేక శిక్షణ కేంద్రాల ద్వారా వివిధ వృత్తులపై శిక్షణ ఇస్తున్నారు. విజయవాడ, మైలవరం, నందిగామ, జి. కొండూరు వంటి ప్రాంతాల్లోని శిక్షణ కేంద్రాల్లో బంగారు కార్మికులు, కొలిమి కార్మికులు (blacksmiths), తాపీ మేస్త్రీలకు (masons) శిక్షణ అందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 78 మంది బంగారు కార్మికులు, 16 మంది కొలిమి కార్మికులు, 19 మంది తాపీ మేస్త్రీలు శిక్షణ పొందారు. ఈ పథకం ద్వారా సంప్రదాయ కళల పరిరక్షణతో పాటు, ఆ వృత్తులకు ఆధునిక శిక్షణ, సాధనాలు, ఆర్థిక మద్దతుతో పాటు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని కేంద్ర సహాయ మంత్రి సుశ్రీ శోభ కరంద్లాజే స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Enrollment
  • PM Vishwakarma Scheme
  • Skill Upgradation
  • Toolkit Incentive
  • Traditional Trades
  • training

Related News

Ap Logo

Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

ఏపీ ప్రభుత్వం కొత్త ప్రైవేట్ విద్యా సంస్థల ఏర్పాటును సులభతరం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా ప్రైవేటు విద్యా సంస్థల చట్టంలో పలు నిబంధనలకు సవరణలు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్పస్‌ ఫండ్‌, ఇతర నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల విన్నపాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.15 లక్షల కార్పస్‌ ఫండ్‌ను రద్దు చేశారు.

  • Nara Lokesh: Minister Nara Lokesh on a Visit to Russia to Attract Investments to AP

    Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల కోసం..రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్

Latest News

  • Blender’s Pride : కోల్‌కతాలో బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ సాంస్కృతిక ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

  • AI CRM : భవిష్యత్ శ్రామిక శక్తి వైపు భారత్.. 10 లక్షల మంది యువతకు సేల్స్‌ఫోర్స్ ఏఐ శిక్షణా సంకల్పం

  • Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!

  • Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ

  • Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd