HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu And Bhuvaneswari Have Breakfast With The Poor At The Anna Canteen

Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

  • Author : Vamsi Chowdary Korata Date : 20-04-2026 - 11:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Bhuvaneshwari Anna Canteens
Nara Bhuvaneshwari Anna Canteens

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఉదయాన్నే చంద్రబాబుతో కలిసి అన్నా క్యాంటీన్‌కు వెళ్లిన ఆమె.. అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించడంతోపాటు.. వారితో కలిసి స్వయంగా ఆహారం తీసుకున్నారు. తద్వారా పుట్టిన రోజులు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో అందరూ అన్నదానానికి తమకు తోచిన మొత్తం విరాళం ఇవ్వాలనే సందేశాన్ని ఆమె ఇచ్చారు.

76వ పుట్టినరోజు… 76 లక్షల విరాళం..

జన్మదినాన్ని పురస్కరించుకుని పటమట అన్న క్యాంటీన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. పేదలు, కార్మికులు, ప్రజల మధ్య తన జన్మదినాన్ని జరుపుకున్న సీఎం.

ముఖ్యమంత్రి చంద్రబాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న… pic.twitter.com/1K3c6Zv8RP

— Telugu Desam Party (@JaiTDP) April 20, 2026

నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత జగన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక టీడీపీ కార్యకర్తలైతే.. తమ అభిమాన నేత పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. చంద్రబాబు నాయుడి జన్మదినం సందర్భంగా.. ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్లకు రూ.76 లక్షలు విరాళంగా ఇచ్చారు. చంద్రబాబు 76వ పుట్టిన రోజుకు గుర్తుగా ఆమె ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు మనవడు, లోకేశ్-బ్రాహ్మణి దంపతుల ఏకైక కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా నారా ఫ్యామిలీ తిరుమలలో అన్నదానం కోసం ఏటా రూ.44 లక్షలు విరాళంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఒక రోజు ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించడానికి ఈ మొత్తం సరిపోతుంది. అందుకే నారా కుటుంబ సభ్యులు దేవాన్ష్ బర్త్ డే సందర్భంగా ఏటా ఈ మొత్తాన్ని టీటీడీకి విరాళం ఇస్తుంటారు. అంతేకాదు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తప్పకుండా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడాన్ని ఈ కుటుంబం ఆనవాయితీగా పెట్టుకుంది.

ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు భువనేశ్వరి విరాళం ఇవ్వడం ద్వారా.. తెలుగునాట కొత్త సంప్రదాయానికి ఆమె తెర తీశారు. ఇప్పటి వరకూ నేతల పుట్టిన రోజు సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు మాత్రమే అన్నదానం, రక్తదానం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు సైతం విరాళం ఇచ్చే కొత్త ఒరవడికి భువనేశ్వరి శ్రీకారం చుట్టారు.

తెలుగు రాష్ట్రాల్లో ఓ రాజకీయ నాయకుడి పుట్టిన రోజు సందర్భంగా సదరు నేత కుటుంబ సభ్యులు పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం, అది కూడా పేదల ఆకలి తీర్చడం కోసం కావడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. అలాగనీ మిగతా నాయకుల కుటుంబ సభ్యులు ఏమీ ఇవ్వడం లేదని చెప్పలేం. బయటకు చెప్పుకోకుండా.. ఎంతో మందికి వారు సాయం చేస్తుండొచ్చు. కానీ భువనేశ్వరి బాహాటంగా విరాళం ప్రకటించడం, చంద్రబాబుతో కలిసి స్వయంగా అన్నా క్యాంటీన్లో అల్పాహారం వడ్డించి, తాము కూడా వారితో కలిసి తినడం ద్వారా అన్నదానం విషయమై అందరూ ఆలోచించేలా చేయగలిగారు.

అందుకే చంద్రబాబు నాయుడు సైతం అన్నదానం విషయంలో తన భార్య భువనేశ్వరిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు తమ శక్తి మేర అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఇది ఒక ప్రజా ఉద్యమంలా మారాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఏ వ్యక్తీ ఆకలితో బాధపడే పరిస్థితి రావొద్దన్నారు. భువనేశ్వరి చొరవ, చంద్రబాబు పిలుపుతో ఏపీలోని నేతలు తమ ఆత్మీయుల పుట్టిన రోజు సందర్భంగా అన్నదానానికి ముందుకొచ్చే వీలుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • Anna Canteen
  • birthday celebrations
  • nara bhuvaneswari
  • vijayawada

Related News

It is because of CM Chandrababu that it is not raining: Former Minister

Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రంలో వర్షాలు పడటం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నంద్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు పడకపోవడానికి పాలకుల మనస్తత్వమే కారణమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఏలుకునే రాజు మనస్తత్వం బాగుంటే

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

  • CM Chandrababu to inaugurate the Rayalaseema Steel Plant in Kadapa.

    Chandrababu Naidu: రాయలసీమ ఉక్కు కడప స్టీల్ ప్లాంట్‌ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Alcohol: మందు కొడితే మంచి నిద్ర వస్తుందా..? నిజమెంత?

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd