HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >We Should Also Win The Kadapa Parliament In The Coming Elections Cm Chandrababu

CM Chandrababu: కడప పార్లమెంట్‌ కూడా మనమే గెలవాలి: సీఎం చంద్రబాబు

2024 ఎన్నికల్లో 93 శాతం సీట్లు మనమే గెలిచాం. టీడీపీ ఎన్నడూ గెలవని రీతిలో మనం విజయం సాధించాం. కడప పార్లమెంటు కూడా మనమే గెలవాలి. రానున్న ఎన్నికలలో కష్టపడదాం.

  • Author : Gopi Date : 18-01-2025 - 3:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

CM Chandrababu: క‌డ‌ప జిల్లా మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన‌ ఎన్టీఆర్ 29వ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ప్రెస్ మీట్ నిర్వ‌హించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. ముందుగా మైదుకూరు తెలుగుదేశం పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ 29 వర్ధంతి మైదుకూరులో జరగడం మీ అదృష్టం. తెలుగు జాతి ఆత్మగౌరవం నందమూరి తారక రామారావు. బడుగు బలహీనర్గాలకు చెరగని దైర్యం నందమూరి తారక రామారావు. ఆరోజు ఆయన ఇచ్చిన ఫించన్ 35 రూపాయలు.. ఈరోజు 4000 వేల రూపాయలు అయ్యాయ‌ని” అన్నారు.

సీఎం చంద్ర‌బాబు ఇంకా మాట్లాడుతూ.. “నందమూరి తారక రామారావు ఒక స్పూర్తి. ఆదర్శంగా నిలిచారు. ఒక రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి అంచలంచెలుగా ఎదిగాడు. అటువంటి మహానేత మళ్ళీ పుట్టడు. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ.. అనంతపురం జిల్లా ఎడారిగా మరుతుండగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పనులు చేశాం. కడప జిల్లాలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కడప జిల్లాకు అన్ని విధాలా సహకరిస్తానని మాట ఇస్తున్నా. రాయలసీమ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. రాయలసీమ రైతాంగం మీసాలు తిప్పే రోజు వస్తుంది. రాయల సీమలో ముఠా కక్షలు ఉండేవి. వాటిని అణచి వేసింది తెలుగుదేశం పార్టీ. పోలవరం ప్రాజెక్టు నీరు సముద్రంలోకి వెళ్లిపోతుంటే వాటిని టీడీపీ ఆపింది” అని అన్నారు.

Also Read: Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి భార‌త్ జ‌ట్టు ఇదే.. కెప్టెన్‌, వైస్ కెప్టెన్ ఎవ‌రంటే?

రెండు సంవత్సరాల్లో పోలవరం నిర్మాణం చేపట్టి తీరుతామ‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. “ఎన్టీఆర్ జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులకు నీరు అందిస్తాం. నేరుగా నీరు అందించి తీరుతాం. నేను కూడా రాయలసీమలోనే పుట్టాను. కరువు రాయలసీమపై బాధ్యత తీసుకుంటాను. కడప జిల్లా కొప్పర్తికి 2300 కోట్ల రూపాయలు ఇచ్చాం. కొప్పర్తికి పారిశ్రామికంగా ఆదుకొని ఉద్యోగాలు కల్పిస్తాం. 250 కోట్ల రూపాయలతో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచంలో అందమైన పర్యాటక ప్రాంతం గండికోట‌కు కేంద్రం 80 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది. గండికోటను ప్రపంచంలో 10వ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం” అని భ‌రోసా ఇచ్చారు.

ఎన్నిక‌ల గురించి ప్ర‌స్తావిస్తూ.. “2024 ఎన్నికల్లో 93 శాతం సీట్లు మనమే గెలిచాం. టీడీపీ ఎన్నడూ గెలవని రీతిలో మనం విజయం సాధించాం. కడప పార్లమెంటు కూడా మనమే గెలవాలి. రానున్న ఎన్నికలలో కష్టపడదాం. ఇంకొంచెం కష్టపడి ఉంటే ఆ 25 ఎంపీ సీట్లు కూడా గెలిచేవాళ్ళం. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకున్నామ‌ని” సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap politics
  • Chandrababu Kadapa Tour
  • CM Chandrababu Naidu
  • Kadapa
  • Mydukur
  • NTR death anniversary
  • tdp

Related News

Midhun Reddy

Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మహిళల భద్రత విషయంలో రాజీ పడకూడదని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మౌనంగా ఉండటం నేరస్తులను ప్రోత్సహించినట్లే అవుతుందని మిథున్ రెడ్డి హెచ్చరించారు

  • Apsrtc

    APSRTC ఉద్యోగుల నిరీక్షణకు తెర..వారి ఖాతాల్లోకి రూ. 75 కోట్లు

  • nara lokesh with pawan kalyan

    నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

  • Telugu Desam Party Appoints

    NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

Latest News

  • Booms Bet Casino registratie: stappenplan voor een snelle start

  • IPL 2026 : కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఐదో ఓటమి.. గుజరాత్ కు హ్యాట్రిక్ విజయం

  • Abhishek Sharma : బల్కంపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్..అమ్మ నీ దయ !!

  • Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

  • Delimitation Bill : ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయం అంటూ ప్రియాంకా గాంధీ సంబరాలు

Trending News

    • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd