Also Read :Kamal Haasan Birthday : నట ‘కమలం’.. 70వ వసంతంలోకి ‘విశ్వనటుడు’
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు ఇలా..
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే ప్రాంతంలో నివాసిగా ఉండి 2024 నవంబరు 1కి మూడేళ్ల ముందు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులంతా ఓటర్లుగా నమోదుకు అర్హులు.
- అర్హులైన గ్రాడ్యుయేట్లు ఏపీ సీఈవో అధికారిక వెబ్‌సైట్లో దరఖాస్తు చేయొచ్చు.
- ఫారం-18ను నింపి, డిగ్రీ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీపై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి ఎమ్మార్వో ఆఫీసులో కూడా ఇవ్వొచ్చు.రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను ఫారం-18పై అతికించాలి. ఆధార్ కార్డు జిరాక్స్, పదో తరగతి సర్టిఫికెట్, ఓటర్ ఐడీ జిరాక్స్‌లను జత చేయాలి.
- అన్ని కలెక్టరేట్లు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు, సబ్ కలెక్టర్ కార్యాలయం, ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, ఎంఈవో ఆఫీసులలో దరఖాస్తులను స్వీకరిస్తారు.
- ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామ రాజు జిల్లాల్లో పట్టభద్రుల నుంచి ఫారం-18 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల చివరి వారంలో ఓటర్ల జాబితా డ్రాఫ్ట్‌ను విడుదల చేస్తారు.
ఓటు నమోదు ఆన్ లైన్‌లో ఇలా..
- గ్రాడ్యుయేట్ ఓటు నమోదు కోసం https://ceoandhra.nic.in/ceoap_new/ceo/ వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.
- హోం పేజీలో ఉండే MLC-e Registration అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత గ్రాడ్యుయేట్-18 ఆప్షన్‌పై నొక్కాలి.
- ఓటర్ ప్రాథమిక వివరాలతో Sign Up చేయాలి.
- ఆ తర్వాత ఫారం- 18పై క్లిక్ చేయాలి.
- ఏ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం కిందికి వస్తారో అక్కడ క్లిక్ చేయాలి.
- పూర్తి వివరాలను ఎంటర్ చేసి, విద్యార్హత పత్రాలను అప్ లోడ్ చేయాలి.
- ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి.
- సబ్మిట్‌పై నొక్కితే అప్లికేషన్ పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
- రిజిస్ట్రేషన్ నెంబరుతో మీ అప్లికేషన్‌ను ట్రాక్ చేయొచ్చు.