Kamal Haasan Birthday : నట ‘కమలం’.. 70వ వసంతంలోకి ‘విశ్వనటుడు’
కమల్ హాసన్(Kamal Haasan Birthday) 1954 నవంబరు 7న తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమకుడి పట్టణంలో జన్మించారు.
- By Pasha Published Date - 10:19 AM, Thu - 7 November 24

Kamal Haasan Birthday : కమల్ హాసన్.. నటనకు మారుపేరు. నటనలో జీవించిపోవడం ఆయనకు చాలా బాగా తెలుసు. అందుకే అశేష ప్రజానీకాన్ని తన ఫ్యాన్స్‌గా చేసుకోగలిగారు. ఇవాళ కమల్ 70వ బర్త్‌డే (నవంబరు 7) సందర్భంగా ఆయన కెరీర్‌తో ముడిపడిన కొన్ని ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం..
Also Read :Ratings To Hotels : ఇక హోటళ్లు, రెస్టారెంట్లకు ఎఫ్ఎస్ఎస్‌ఏఐ రేటింగ్.. స్ట్రీట్ వెండర్లకూ సర్టిఫికెట్లు
- కమల్ హాసన్(Kamal Haasan Birthday) 1954 నవంబరు 7న తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమకుడి పట్టణంలో జన్మించారు.
- కమల్ హాసన్ అసలు పేరు.. పార్థసారథి శ్రీనివాసన్.
- ఆరేళ్ల వయసులోనే కమల్ సినీరంగంలోకి అడుగుపెట్టారు. 1960లో ‘కలాతూర్ కన్నమ్మ’ మూవీ ద్వారా బాలనటుడిగా ఆయన పాత్ర పోషించారు. ఈ మూవీలో అద్భుత నటనకుగానూ కమల్‌కు బెస్ట్ చైల్డ్ యాక్టర్‌గా రాష్ట్రపతి నుంచి అవార్డు లభించింది.
- ఇప్పుడు ఏడు పదుల వయసులోనూ ఆయన సినిమాల్లో కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.
- ‘యూనివర్సల్ స్టార్’, ‘లోకనాయకుడు’, ‘విశ్వనటుడు’గా కమల్ ఖ్యాతిని గడించారు.
- కమల్‌కు డైరెక్టుగా సినిమాల్లో హీరో పాత్ర దక్కలేదు. దీంతో ఆయన సైడ్ రోల్స్ చేసేవారు.
- కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డాన్స్ కొరియోగ్రాఫర్‌గా కమల్ పని చేశారు.
Also Read :Kurnool to Vizag : కర్నూలు టు విశాఖపట్నం రైల్వే రూట్.. మూడు గంటల్లోనే అమరావతికి
- ఎట్టకేలకు 1974లో కన్యాకుమారి అనే మలయాళ మూవీలో హీరోగా పనిచేసే అవకాశం కమల్‌కు దక్కింది. ఈ మూవీలో నటనకుగానూ ఆయనకు బెస్ట్ యాక్టర్‌గా ఫిలింఫేర్ అవార్డు దక్కింది.
- ఆ తర్వాత దేశంలోని దాదాపు 8 ఎనిమిది భాషల సినిమాల్లో కమల్ నటించారు.
- 1976లో ‘అంతులేని కథ’ సినిమాలో క్యామియో చేయడంతో తొలిసారిగా తెలుగు తెరపై కమల్ కనిపించారు.
- ‘మరో చరిత్ర’ మూవీలో సోలో హీరోగా కమల్ మనకు కనిపించారు.
- కె. బాలచందర్‌తో చేసిన సినిమాలు కమల్‌ను హీరోగా నిలబెట్టాయి.
- కె. విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన చిత్రాలు కమల్‌కు స్టార్ డమ్‌ను తెచ్చాయి.
- సినీ ఇండస్ట్రీకి సేవలు అందిస్తున్నందుకుగానూ భారత ప్రభుత్వం కమల్‌ను ‘పద్మశ్రీ’ ‘పద్మభూషణ్’ వంటి పురష్కారాలతో సత్కరించింది.
- కమల్ నటించిన ఇండియన్ 3 మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
- బ్లాక్ బాస్టర్ మూవీ కల్కిలో కమల్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న కల్కి 2లో కూడా కమల్ నటిస్తున్నారు.