HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vijayawada Corporation Tdp Focused On Ysrcp Corporators

VIjayawada Corporation: వైసీపీలో మారుతున్న లెక్కలు, చేజారుతున్న విజయవాడ కార్పొరేషన్

ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న మాట వాస్తవం, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కనిపించింది. స్థానిక సంస్థల్లో వైసీపీదే ఆధిపత్యం కనిపించింది. అయితే ఇప్పుడు అధికారం చేజారడంతో నేతలు పార్టీని వీడేందుకు అడుగులు వేస్తున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 23-08-2024 - 1:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
VIjayawada Corporation
VIjayawada Corporation

VIjayawada Corporation: అధికారం కోల్పోయిన వైసీపీ రోజు రోజుకి బలహీన పడుతుంది. గెలిచింది 11 మంది ఎమ్మెల్యేలే కావడంతో ఆ పార్టీలో ఉండేందుకు నేతలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు టీడీపీకి జంప్ అయ్యారు. తాజాగా ముగ్గురు ముగ్గురు వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.దీంతో వైసీపీ పార్టీలో ఆందోళన వ్యక్తం అవుతుంది.

ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న మాట వాస్తవం, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కనిపించింది. స్థానిక సంస్థల్లో వైసీపీదే ఆధిపత్యం కనిపించింది. అయితే ఇప్పుడు అధికారం చేజారడంతో నేతలు పార్టీని వీడేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ ఫిరాయింపుల పర్వం నిరాటంకంగా కొనసాగుతోందని అంటున్నారు. తాజాగా విజయవాడ వైసీపీ కార్పోరేటర్లు టీడీపీలో చేరారు. ముగ్గురు వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు గురువారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ అలియాస్‌ చిన్ని, ఇతర నేతల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కార్పొరేటర్లు– 45 డివిజన్‌కు చెందిన కె హర్షద్, 44 డివిజన్‌కు చెందిన ఎం రత్న కుమారి, విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 54 డివిజన్‌కు చెందిన మాధురి లావణ్య ఎన్టీఆర్ భవన్‌లో టిడిపిలో చేరారు. ఎంపీ చిన్ని, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా కార్పొరేటర్లకు టీడీపీలోకి స్వాగతం పలికారు.

విజయవాడని త్వరలో టీడీపీకి కంచుకోటగా మారుస్తానని చెప్పారు కేశినేని చిన్ని. మంచి ఇమేజ్ ఉన్న నేతలను టీడీపీలోకి తీసుకుంటామన్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో విజయవాడ నగరం అభివృద్ధి చెందిందని, మరో ఐదేళ్లలో నగరం పెద్దఎత్తున అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమ, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, రాష్ట్ర మైనార్టీ టీడీపీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎండీ ఫతావుల్లా, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంఎస్ బేగ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Also Read: Tirumala : శ్రీవారి సన్నిధానంలో గోల్డెన్ బాయ్స్ హల్చల్..భక్తుల చూపంతా వీరి బంగారంపైనే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3 Corporators
  • ap politics
  • MP Kesineni Chinni
  • tdp
  • telugu news
  • VIjayawada Corporation
  • ysrcp

Related News

Ntr Sr

NTR : రాజకీయాల్లో ఎన్టీఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసే పార్టీనే లేదా ?

ఎన్టీఆర్ రికార్డును విజయ్ బ్రేక్ చేయలేకపోయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో 35% ఓట్లను సాధించడం సామాన్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ కాలంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 'తెలుగువారి ఆత్మగౌరవం' అనే నినాదం బలంగా

  • TDP Mahanadu 2026 Event In Nellore

    Mahanadu: నెల్లూరులో టీడీపీ మహానాడు.. వేదిక ఖరారు!

Latest News

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd