KumaraSwamy : సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి కుమారస్వామి భేటి
KumaraSwamy : సెయిల్ లో విలీనం అనంతరం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిస్థితి, కార్మికుల స్థితిగతులు మెరుగవ్వాలనే విషయాన్ని చంద్రబాబు కేంద్రమంత్రి కుమారస్వామికి స్పష్టం చేశారు.
- By Latha Suma Published Date - 04:46 PM, Tue - 8 October 24

CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు చంద్రబాబు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్, నేషనల్ హైవేల అభివృద్ధి తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం అనంతరం, ఢిల్లీలో సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి వచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)లో విలీనం చేయడంపై చంద్రబాబు, కుమారస్వామి మధ్య కీలక చర్చ జరిగింది. సెయిల్ లో విలీనం అనంతరం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిస్థితి, కార్మికుల స్థితిగతులు మెరుగవ్వాలనే విషయాన్ని చంద్రబాబు కేంద్రమంత్రి కుమారస్వామికి స్పష్టం చేశారు.
Read Also: Nagarjuna : నాంపల్లి కోర్టుకు హాజరైన నాగార్జున..స్టేట్‌మెంట్ రికార్డ్
కాగా, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కోనసాగుతుంది. ఈ క్రమంలోనే సాయంత్రం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమవుతారు. అనంతరం 5:45 గంటలకు కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ కానున్నారు. ఇక రాత్రి 8 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాత్రి 11:15 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో చంద్రబాబు సమావేశమవుతారు. వరద సాయం, రాజధాని అమరావతి అవుటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం,రాష్ట్రంలో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు, బడ్జెట్లో ప్రకటించిన పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి గురించి ఈ సందర్భంగా కేంద్రమంత్రులతో చర్చించి నిధుల విడుదల గురించి ప్రస్తావించనున్నారు.