HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Nagarjuna Who Appeared In Nampally Court Statement Record

Nagarjuna : నాంపల్లి కోర్టుకు హాజరైన నాగార్జున..స్టేట్‌మెంట్ రికార్డ్

Nagarjuna : తమ కుటుంబసభ్యులు నటించిన సినిమాలకు సైతం జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని, సినిమా రంగంతో పాటు పలు సామజిక సేవా కార్యక్రమాలు సైతం తన ఫ్యామిలీ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు.

  • Author : Latha Suma Date : 08-10-2024 - 4:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nagarjuna who appeared in Nampally court..statement record
Nagarjuna who appeared in Nampally court..statement record

Nagarjuna statement : టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున స్టేట్‌మెంట్‌ను నాంపల్లి కోర్టు రికార్డ్ చేసింది. తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, సినిమా రంగం ద్వారా దేశ వ్యాప్తంగా తమ కుటుంబానికి ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయని నాగార్జున చెప్పారు. తమ కుటుంబసభ్యులు నటించిన సినిమాలకు సైతం జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని, సినిమా రంగంతో పాటు పలు సామజిక సేవా కార్యక్రమాలు సైతం తన ఫ్యామిలీ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు.

నాంపల్లి కోర్టుకు చేరుకున్న అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అమల. #nagarjun #KondaSurekha #tollywood #HashtagU pic.twitter.com/qXDCoHlY8a

— Hashtag U (@HashtaguIn) October 8, 2024

తన కొడుకు నాగ చైతన్య, సమంతల విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ కారణంగా జరిగాయని మంత్రి కొండా సురేఖ అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. మహిళా మంత్రి బహిరంగంగా అలా మాట్లాడం వల్ల మా కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని నాగార్జున స్టేట్ మెంట్ ను కోర్టు రికార్డు చేసింది. తమ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును నాగార్జున కోరారు.

Read Also: Vinesh Phogat : ఇది ఎల్లప్పుడూ పోరాట మార్గాన్ని ఎంచుకునే ప్రతి అమ్మాయి..మహిళ యొక్క పోరాటం: వినేష్‌

పిటిషన్ ఫైల్ చేయడానికి కారణం, ఉద్దేశం ఏంటని నాగార్జునను కోర్టు ప్రశ్నించింది. మంత్రి కొండా సురేఖ తమ రాజకీయ ప్రయోజనాల కోసం తన ఫ్యామిలీపై అమర్యాద పూర్వక వాఖ్యలు చేశారని.. దాంతో తమ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందని నాగార్జున స్టేట్ మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా తన కొడుకు నాగచైతన్య, సమంత విడాకులుపై మంత్రి కొండా సురేఖ అనుచిత వాఖ్యలు చేశారని.. ఆమె చర్యలకు ఆదేశించాలని కోర్టును నాగార్జున కోరారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, అందుకే పరువు నష్టం దావా వేసినట్లు నాగార్జున తెలిపారు.

Read Also: Haryana Election Results 2024: ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • akkineni nagarjuna
  • Defamation Suit
  • Konda Surekha
  • Naga Chaitanya Samantha Divorce Issue
  • Nagarjuna statement
  • Nampally court

Related News

'Ibomma' organizer Ravi in ​​police custody again

మళ్లీ పోలీసుల కస్టడీలోకి ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవి

రవిపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. వీటిలో నాలుగు కేసులకు సంబంధించిన విచారణ కోసం ఒక్కో కేసుకు మూడు రోజుల చొప్పున, మొత్తం 12 రోజుల పాటు పోలీసులు రవిని విచారించడానికి అనుమతిచ్చారు.

  • Akkineni Nagarjuna

    ANR కాలేజీకి అక్కినేని నాగార్జున 2 కోట్ల విరాళం

Latest News

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd