HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Two New Vande Bharat Trains For Telugu States

Vande Bharat trains : తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు

Two new Vande Bharat trains: సెప్టెంబర్ 16న ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ -హైదరాబాద్, దుర్గ్ - విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

  • By Latha Suma Published Date - 06:46 PM, Fri - 13 September 24
  • daily-hunt
Two new Vande Bharat trains for Telugu states
Two new Vande Bharat trains for Telugu states

Two new Vande Bharat trains: కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రయాణించే వందేభారత్ రైళ్ల సంఖ్య మరింత పెరగనుంది. సెప్టెంబర్ 16న ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ -హైదరాబాద్, దుర్గ్ – విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ రైళ్లు అనుసంధానత కలిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.

Read Also: రోహిత్ కెప్టెన్సీపై స్టార్ బౌలర్ క్రేజీ స్టేట్మెంట్

మరోవైపు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వయో వృద్ధుల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆపన్నహస్తం అందించారని కిషన్ రెడ్డి తెలిపారు. 70 ఏళ్లు దాటిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించారన్నారు. పేద, ధనిక తేడా లేకుండా 6 కోట్ల మంది వయోవృద్ధులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఈ పథకంపై రూ. 3,437 కోట్లను కేంద్రం ఖర్చ చేయనుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అదనంగా మరో 10 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి జరగనుందని కిషన్ రెడ్డి తెలిపారు. 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులందరికీ ఈ పథకం కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించిందని తెలిపారు. ఇప్పటికే ఆయుష్మాన్ పరిధిలో ఉన్న కుటుంబాల్లో 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు అదనంగా ఏడాదికి రూ. 5 లక్షల టాప్-అప్ కవర్ ఇవ్వనుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో వయోవృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వయో వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.

Read Also: Team India Unlucky Players: టీమిండియాలో దురదృష్టానికి కేరాఫ్ వాళ్లిద్దరే


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Durg - Visakhapatnam
  • Nagpur - Hyderabad
  • pm modi
  • telangana
  • Union Minister Kishan Reddy
  • vande bharat trains

Related News

Supreme Court expresses deep anger over dog attacks on Delhi streets

42% Backward Class Quota : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కు భారీ దెబ్బ

42% Backward Class Quota : ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేయడంతో, హైకోర్టు ఆదేశాలు చెల్లుబాటుగా మిగిలాయి. ఇది తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా పెద్ద దెబ్బగా భావిస్తున్నారు

  • PM Modi

    PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

  • PM Modi

    PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నోటిఫికేష‌న్ విడుద‌ల‌!

  • Thermal Plant Palwancha

    Thermal Plant: పాల్వంచలో మరో థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందడుగు

Latest News

  • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

  • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

  • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

  • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

  • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

Trending News

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd