Ganesh Immersion: ఏపీ గణేష్ నిమజ్జనంలో అపశృతి
దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు మొదలయ్యాయి. భారీ ఎత్తైన విగ్రహాలు.. భారీ సెట్టింగ్‌లతో మండపాలు ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా కేవలం 9 రోజుల కోసం ఏర్పాటు చేసే విగ్రహాలు
- By Praveen Aluthuru Published Date - 03:24 PM, Thu - 21 September 23

Ganesh Immersion: దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు మొదలయ్యాయి. భారీ ఎత్తైన విగ్రహాలు.. భారీ సెట్టింగ్‌లతో మండపాలు ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా కేవలం 9 రోజుల కోసం ఏర్పాటు చేసే విగ్రహాలు, మండపాల కోసం లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్నారు. అనంతరం తల్లి గంగమ్మ చెంతకు చేరుస్తారు. అయితే నిమజ్జనంలో కొన్నిసార్లు ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. వారంపాటు సంతోషంగా జరుపుకుని నిమజ్జనం చేసే క్రమంలో నీటిలో పడి చనిపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో గురువారం గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కృష్ణా నదిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.బాపట్ల జిల్లా రేపల్లె మండలం పెనుమూడి గ్రామంలో కొందరు యువకులు విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు రేపల్లె వాసులు విజయ్ (22), వెంకటేష్ (25)గా గుర్తించారు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షకు తరలించారు.
Also Read: TDP- Janasena Alliance : జనసేనతో పొత్తు లోక కల్యాణం కోసమే – అయ్యన్న