HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tomato Prices Are Very Low Tomato Purchases Will Begun In Andhra Pradesh From Today

Tomato Prices : టమాటా ధరలు ఢమాల్.. రంగంలోకి చంద్రబాబు సర్కార్

కానీ మధ్యలో ఉన్న బ్రోకర్లు మాత్రం టమాటా(Tomato Prices) పంటను కొని లాభాలను పండించుకుంటున్నారు.

  • Author : Pasha Date : 21-02-2025 - 3:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tomato Benefits

Tomato Prices : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టమాటా ధరలు డౌన్ అయ్యాయి. దీంతో టమాటా రైతులు లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు. తమకు కనీసం పెట్టుబడి తిరిగొచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోని ఆస్పరి, పత్తికొండ మార్కెట్లలో కేజీ టమాటా ధర రూ.4కు పడిపోయింది. దీంతో ఎంతోమంది రైతులు టమాటాలను పారబోసి బాధతో వెనక్కి తిరిగారు. టమాటాను సాగు చేసినందుకు కనీసం రవాణా ఛార్జీలు కూడా తమ చేతికి రాలేదని రైతులు చెప్పుకొచ్చారు.బహిరంగ మార్కెట్లో మాత్రం కేజీ టమాటా ధర రూ.15 నుంచి  రూ.20 దాకా పలుకుతోంది. ఓ వైపు రైతు, మరోవైపు కొనుగోలుదారుడిపై ధరా భారం కంటిన్యూ అవుతోంది. కానీ మధ్యలో ఉన్న బ్రోకర్లు మాత్రం టమాటా(Tomato Prices) పంటను కొని లాభాలను పండించుకుంటున్నారు.

Also Read :KCR Vs Chandrababu : రేవంత్ కాదు, విలన్ చంద్రబాబు!!

మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో..

ఈనేపథ్యంలో టమాటా రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కారు ముందుకు వచ్చింది. ఈరోజు నుంచి ఏపీలోని అన్ని జిల్లాల్లో  ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటా పంటను కొంటున్నారు. ఈవిధంగా కొనే టమాటాలను రైతు బజార్లలో విక్రయిస్తారని తెలుస్తోంది. అవసరం మేరకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేయాలని ఏపీ సర్కారు మార్కెటింగ్ శాఖ భావిస్తోందట. మొత్తం మీద ఏపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై టమాటా రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read :Solar Soundbox : సోలార్‌ సౌండ్‌ బాక్స్ వచ్చేసింది.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?

పీఎం కిసాన్ కీలక అప్‌డేట్

తాజాగా 19వ విడత ప్రధానమంత్రి కిసాన్ నిధుల జమపై ఒక అప్‌డేట్ వచ్చింది. దీని ప్రకారం ఫిబ్రవరి 24వ తేదీన రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున జమ చేస్తారు. ఈ డబ్బులను రైతులు పెట్టుబడి అవసరాల కోసం వాడుకోవచ్చు. ఇప్పటి వరకు 18 విడతల్లో పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ప్రధానమంత్రి కిసాన్ పథకం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • pm kisan
  • tomato
  • tomato farmers
  • Tomato Prices
  • Tomato Purchases

Related News

Skilling Advisor Seetha Sharma Resigns from Skill Development Department

ఏపీ సలహాదారు పదవికి సీతా శర్మ రాజీనామా

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్, ట్రైనింగ్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ అడ్వైజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీతా శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పదవీకాలం పూర్తికాకుండానే ఆమె వైదొలగడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే, గత మార్చి 5న సీతా శర్మ తన రాజీనామా

  • Nara Bhuvaneshwari Anna Canteens

    Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

  • Simhachalam Chandanotsavam Simhadri Appanna Darshanam

    Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

Latest News

  • Kadapa : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించేందుకు భార్య ప్లాన్

  • Preethi Reddy : BJP లో చేరడంపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ !!

  • YCP MLC అనంతబాబు అరెస్ట్

  • RTC Driver Suicide : డ్రైవర్ కుటుంబానికి రూ.10లక్షలు, ఉద్యోగం..ప్రభుత్వం ప్రకటన

  • WB Elections : TMC నేతలను గుండాలతో పోల్చిన మోడీ

Trending News

    • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd