HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >This Is Cm Jagan First Tweet After The Elections

CM Jagan Tweet: ఎన్నిక‌ల త‌ర్వాత సీఎం జ‌గ‌న్ ఫ‌స్ట్ ట్వీట్‌ ఇదే.. ఏమ‌న్నారంటే..?

ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల‌కు పోలింగ్ ప్ర‌క్రియ మే 13 (సోమ‌వారం) ముగిసిన విష‌యం తెలిసిందే. అయితే ఏపీలో ఎన్న‌డూ లేని విధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 81 శాతం పోలింగ్ న‌మోదై రికార్డు బ్రేక్ చేసింది.

  • Author : Gopi Date : 14-05-2024 - 6:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Jagan Tweet
CM Jagan Tweet

CM Jagan Tweet: ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల‌కు పోలింగ్ ప్ర‌క్రియ మే 13 (సోమ‌వారం) ముగిసిన విష‌యం తెలిసిందే. అయితే ఏపీలో ఎన్న‌డూ లేని విధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 81 శాతం పోలింగ్ న‌మోదై రికార్డు బ్రేక్ చేసింది. మొన్న‌టి వ‌ర‌కు ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్న నేత‌లు ఇప్పుడు కాస్త రిలీఫ్ మోడ్‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీలో ప‌ని చేసిన కార్య‌క‌ర్త‌ల‌కు, ముఖ్య నాయ‌కులకు, మ‌ద్ద‌తుదారుల‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఎన్నిక‌ల ముగియ‌క‌ముందే చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ కార్య‌క‌ర్త‌ల‌కు, మ‌ద్ద‌తుదారుల‌కు కృతజ్ఞతలతో పాటు కూట‌మిదే విజ‌యం అని చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా ఎన్నిక‌ల అనంత‌రం ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేక కృతజ్ఞతలు తెలిపారు. అది కూడా ఎక్స్ వేదిక‌గా ఈరోజు ఒక ట్వీట్ (CM Jagan Tweet) చేశారు. ఆయ‌న ట్వీట్‌లో ప్ర‌తి ఒక్క‌రిన్నీ నా అని సంబోధించారు. అయితే ఎన్నిక‌ల అనంత‌రం జ‌గ‌న్ చేసిన ఈ ఫ‌స్ట్ ట్వీట్ ప్ర‌స్తుతం ఎక్స్‌లో తెగ వైర‌ల్ చేస్తుంది. ఈ ట్వీట్‌లో ఆయ‌న మ‌రోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుంద‌ని ఇన్ డైరెక్ట్‌గా చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు పాల‌న ఎలా సాగిందో త‌ర్వాత కూడా పాలన అలాగే కొన‌సాగిస్తాన‌ని సీఎం జ‌గ‌న్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Also Read: High Tension : తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం

నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు… pic.twitter.com/RQcsHZqWEO

— YS Jagan Mohan Reddy (@ysjagan) May 14, 2024

సీఎం జ‌గ‌న్ ట్వీట్‌లో ఏం రాసుకొచ్చారంటే.. “నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన వైసీపీ పార్టీ గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను” అని సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు. అయితే సీఎం జ‌గ‌న్ చేసిన ఈ ట్వీట్‌పై ప‌లు రకాల కామెంట్లు వ‌స్తున్నాయి. మే 15 నుంచి మే 30వ తేదీ వ‌ర‌కు జ‌గ‌న్ లండ‌న్ టూర్ వెళ్తున్న విష‌యం తెలిసిందే. త‌న కూతుర్ల కోసం జ‌గ‌న్ ఈ టూర్ వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ap Aseembly Elections 2024
  • ap news
  • ap politics
  • cm jagan
  • CM Jagan Tweet
  • ysrcp

Related News

nara lokesh with pawan kalyan

నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేశ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేశ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈ కొత్త బాధ్యతల్లో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేస్తున్న లోకేశ్, ఇప్పుడు పార్టీ పరంగా కీలకమైన బాధ్యతలు చేపట్ట

  • Telugu Desam Party Appoints

    NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

  • Telugu Desam Party Appoints Nara Lokesh as Working President

    Telugu Desam Party: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ

Latest News

  • IPL 2026 -RCB vs DC : ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో DC విజయం

  • NBK-Koratala Shiva : బాలకృష్ణ ను డైరెక్ట్ చేయబోతున్న కొరటాల ?

  • Ram : సొంతంగా కథ రాసుకున్న హీరో రామ్..మరి ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడో ?

  • Coke Studio India : కోక్ స్టూడియో నుండి బుల్లెయా వే సాంగ్

  • Godrej Agrovet : లక్ష మంది మహిళా నిపుణులే లక్ష్యంగా గోద్రెజ్ ‘దిశ’

Trending News

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    • ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd