HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Andhra Pradesh Government Is Providing It Jobs To Unemployed Youth Through Skill Development

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కౌశలం తో ఐటీ ఉద్యోగం

  • Author : Vamsi Chowdary Korata Date : 19-12-2025 - 11:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Koushalam Portal
Koushalam Portal

Koushalam Portal : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తోంది. ‘కౌశలం’ పోర్టల్ ద్వారా ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పటికే 24.14 లక్షల మంది యువత వివరాలు సేకరించి, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు అందించింది. మరిన్ని ఉపాధి అవకాశాల కోసం దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించనుంది. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల కల్పనకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోంది.

  • ఏపీలో కౌశలం ద్వారా ఐటీ ఉద్యోగాలు
  • పోర్టల్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
  • ఇప్పటికే 2.5 లక్షల మందికి ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పనిలో ఉంది. ఈ మేరకు ఐటీ కంపెనీలు, పరిశ్రమలను తీసుకుురావడంతో పాటుగా.. ఆయా సంస్థలకు అవసరమైన నైపుణ్యం ఉండేలా శిక్షణ ఇస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కౌశలం పేరుతో సర్వే నిర్వహించి నిరుద్యోగుల సమాచారాన్ని సేకరించింది.. ప్రస్తుతం వారందరికి పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, జీసీసీ  అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను గుర్తించే పనిలో ఉంది.

నిరుద్యోగ యువతకు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ‘కౌశలం’ అనే పోర్టల్‌ను ప్రారంభించింది. ‘ఏఐ ఆధారంగా పనిచేసే పోర్టల్‌ ద్వారా ప్రైవేటు కంపెనీలకు అవసరమైన నైపుణ్య సిబ్బందిని గుర్తించే చర్యలు చేపట్టాం. డేటా ఆధారంగా అర్హత కలిగిన యువతను గుర్తించి, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అని ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్‌ కాటమనేని తెలిపారు. ఈ పోర్టల్‌లో ఇప్పటికే చదువుకుని ఉద్యోగం లేనివారు, తమ అర్హతకు తగిన ఉద్యోగం దొరకని వారి వివరాలను నమోదు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 24.14 లక్షల మంది యువత నుంచి సమాచారం సేకరించారు.. పోర్టర్‌లో పొందుపరిచారు. యువతలో డేటా, కోడింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ వంటి వాటిని పరిశీలించి, అర్హతలను బట్టి దాదాపు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు కూడా కల్పించడం విశేషం. యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించే దిశగా.. రాబోయే రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, ముంబయి వంటి నగరాల్లోని కంపెనీలతో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఈ ‘కౌశలం’ పోర్టల్‌ను రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. యువత విద్యార్హతలు, ఇతర వివరాలను కంపెనీలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.. ఈ ప్రాజెక్టును రాబోయే మూడు నెలల్లో పూర్తి స్థాయిలో కార్యాచరణలోకి తీసుకురానున్నారు. కౌశలం ద్వారా యువతకు వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలను కూడా కల్పించనుంది ప్రభుత్వం.. ఈ మేరకు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పరీక్షల్ని కూడా నిర్వహిస్తున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh government
  • AP CM Chandrababu Naidu
  • IT Jobs
  • Koushalam Portal
  • naralokesh
  • Un Employed

Related News

Ap Cm Smart Family Benefit

ప్రభుత్వ సేవలు, పథకాలకు.. ఏపీలో ఆధార్‌ను మించిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ త్వరలో!

ప్రభుత్వ పాలనలో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోటీ 40 లక్షల కుటుంబాలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ గురించి చంద్రబాబు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద

  • Renamed Grama Ward Sachival

    AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

  • 5,757 Constables Inducted I

    కూటమి సర్కార్ గుడ్ న్యూస్ ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీగా స్టైఫండ్ పెంపు!

  • Infosys In Visakhapatnam

    విశాఖపట్నంలో మరో ఐటీ కంపెనీ.. ఇన్ఫోసిస్?

  • Farmers Drumstick

    ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!

Latest News

  • దేశ రక్షణలో భాగం కాబోతున్న పూడూరు సర్పంచ్

  • విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!

  • టీమిండియాకు ఎంపిక కాక‌పోవ‌టంపై ఇషాన్ కిష‌న్ కీల‌క వ్యాఖ్య‌లు!

  • ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు

  • 2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాప్-10 భారతీయ క్రికెటర్లు వీరే!

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd