TDP : ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమలో ఎగిరిన టీడీపీ జెండా.. ఎమ్మెల్సీలుగా వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్
ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుగాలి వీచింది. అధికారంలో ఉండి కూడా రెండు ఎమ్మెల్సీ
- By Prasad Published Date - 07:27 AM, Sat - 18 March 23

ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుగాలి వీచింది. అధికారంలో ఉండి కూడా రెండు ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ కోల్పోవడం ఆ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తుంది. గతంలో ఈ స్థానాల్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికి తెలుగుదేశం గెలుచుకోలేకపోయింది. కొన్ని ఎన్నికల్లో ఇతర పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చింది టీడీపీ. అయితే ఈ సారి టీడీపీ అందుకు భిన్నంగా వ్యవహరించింది. మూడు పట్టభద్రుల స్థానాల్లో పోటీ చేయాలని భావించిం అందుకు సమర్థులైన అభ్యర్థులను బరిలో దింపింది. ఉత్తరాంధ్ర నుంచి డాక్టర్ వేపాడ చిరంజీవి, తూర్పు రాయలసీయ నుంచి కంచర్ల శ్రీకాంత్, పశ్చిమ రాయలసీమ నుంచి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని టీడీపీ బరిలోకి దింపింది.

TDP MLC
ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమలో టీడీపీకి మొదటి నుంచి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా డాక్టర్ వేపాడ చిరంజీవి, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. పశ్చిమ రాయలసీమలో టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తుంది. ఆరు రౌండ్ల వరకు వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డి స్వల్ప ఆధిక్యంలో ఉండగా.. తరువాత రౌండ్లలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు. ఈ స్థానం కూడా టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు.

Related News

CM Jagan: నేడు దెందులూరులో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
మూడో విడత ఆసరా పథకాన్ని శనివారం ఉదయం 11 గంటలకు దెందులూరులో సీఎం జగన్ (CM Jagan) బటన్ నొక్కి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సభ నిర్వహణ ఏర్పాట్లను ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి పర్యవేక్షించారు.