HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Mlas Comments On Goverment

TDP MLA’s : చంద్రబాబుని నిర్దోషిగా నిరూపించి ప్రజలముందుకు తీసుకొస్తాం – టీడీపీ ఎమ్మెల్యేలు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిర్ధోషిగా బ‌య‌టికి వ‌స్తార‌ని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. మంగ‌ళ‌గిరి టీడీపీ కార్యాల‌యంలో

  • Author : Prasad Date : 22-09-2023 - 5:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిర్ధోషిగా బ‌య‌టికి వ‌స్తార‌ని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. మంగ‌ళ‌గిరి టీడీపీ కార్యాల‌యంలో ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, మంతెన రామరాజు మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి ప్రభుత్వం తరుపున హైకోర్టులో వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప కేసులో యాక్ట్ 17 (ఏ) వర్తిస్తుందని చెప్పి, చంద్రబాబు విషయంలో అది వర్తించదని చెప్పడం చూస్తే భారతదేశంలో తీర్పుతీర్పులకు మార్పులు ఎలా ఉంటాయనే సందేహం ప్రజలకు కలుగు తోందన్నారు. హైకోర్ట్ జడ్జిమెంట్ లోని పేజీ నెం -5 లో 2014-15 నుంచి 2018-19 వరకు సీఐడీ విచారణ జరిగిందని చెప్పారు. పేజీనెం-29లో ఈ కేసు విచారణ 2015 నుంచి అని మెన్షన్ చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ప్ర‌స్తావించారు.

అవకతవకలు 2019 మార్చి వరకు జరిగాయని ఫిర్యాదుదారు, ఫోరెన్సిక్ ఆడిట్ వారు చెప్పారని.. అలాంటప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకి 17 (ఏ) యాక్ట్ వర్తిస్తుందని మేము భావిస్తున్నామ‌ని తెలిపారు. ఈ కేసువిచారణలో న్యాయమూర్తులు సరైన ధృక్ఫథంలో ఆలోచించలేదన్నది తమ అభిప్రాయమ‌ని.. కాబట్టి ఈ కేసులో కిందికోర్టు ఇచ్చిన తీర్పులపై తాము ఉన్నత న్యాయ స్థానా లను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నామ‌న్నారు. న్యాయస్థానాల్లో చంద్రబాబును నిర్దోషిగా నిరూపించి ప్రజలముందుకు తీసుకొస్తామ‌ని టీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై అక్రమ కేసు పెట్టి, ఆయన్ని దోషిగా చిత్రీకరించ డానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీడీపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చించకుండా, తమకు మాట్లాడే అవకాశమివ్వకుండా వందలమంది మార్షల్స్ సాయంతో సభను నడపాలని ప్రయత్నించారని.. ఆ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాపై తిట్లదండకం మొదలుపెట్టి, దౌర్జన్యకాండకు దిగారు. ఒక కల్పిత కేసుతో చంద్రబాబుపై బురదజల్లడానికి ఈ ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోందన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap
  • AP Skill case
  • chandrababu
  • tdp

Related News

MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈరోజు కర్నూల్‌లో పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. కర్నూల్‌లో నిర

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

  • Massive public meeting on the alliance's two-year rule

    Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ

  • Zomato gets Rs 9.6 crore GST demand from Andhra Pradesh

    Zomato: జొమాటో కు షాక్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 9.6 కోట్ల జీఎస్‌టీ నోటీసు

  • That is the very day the 'Thalliki Vandanam' money gets credited!

    Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

Latest News

  • Indriya – Aditya Birla Jewellery : భారతీయ సంస్కృతి అద్దంపట్టేలా ‘ఇంద్రియ’ అద్భుత ఆవిష్కరణ

  • Amazon : అమెజాన్‌లో జోరుగా టూ-వీలర్ సేల్స్!

  • Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అనుకూలించని వాతావరణం

  • Breaking News.. చిన్నారి కేసులో మరో విషాదం.. చనిపోయిన కుక్క.. గుండె పగిలేలా ఏడుస్తున్న తల్లి

  • Shabbir Ali: షబ్బీర్‌అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు

Trending News

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd