HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Shock For Zomato Andhra Pradesh Government Issues Gst Notice For Rs 9 6 Crore

Zomato: జొమాటో కు షాక్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 9.6 కోట్ల జీఎస్‌టీ నోటీసు

  • Author : Vamsi Chowdary Korata Date : 11-06-2026 - 4:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Zomato gets Rs 9.6 crore GST demand from Andhra Pradesh
Zomato gets Rs 9.6 crore GST demand from Andhra Pradesh

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు ఏపీ జీఎస్టీ (వస్తు సేవల పన్ను) విభాగం ఊహించని షాక్ ఇచ్చింది. పన్ను ఎగవేత ఆరోపణలపై ఏకంగా రూ. 9.63 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, తక్కువ పన్ను చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు జొమాటో మాతృసంస్థ అయిన ‘ఎటెర్నల్’ (Eternal) కు ఈ నోటీసు అందింది.

వివరాల్లోకి వెళితే.. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి మధ్య కాలానికి సంబంధించిన జీఎస్టీ లెక్కల్లో లోపాలు ఉన్నాయని ఏపీ జీఎస్టీ అధికారులు ఆరోపించారు. వాస్తవంగా చెల్లించాల్సిన దానికంటే తక్కువగా పన్ను చెల్లించారని పేర్కొన్నారు. ఈ మేరకు తమకు జూన్ 9న ఏపీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి ఆర్డర్ అందినట్లు జొమాటో మాతృసంస్థ ఎటెర్నల్ తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో అధికారికంగా వెల్లడించింది.

జీఎస్టీ అధికారులు జారీ చేసిన నోటీసు ప్రకారం.. మొత్తం రూ. 9.63 కోట్ల డిమాండ్‌లో అసలు పన్ను బకాయి రూ. 6.49 కోట్లుగా ఉంది. దీనిపై వడ్డీగా రూ. 2.50 కోట్లు, పెనాల్టీ కింద మరో రూ. 64.87 లక్షలు కలిపి చెల్లించాలని ఆదేశించారు. ఈ నోటీసుపై కంపెనీ స్పందిస్తూ, తాము దీనిపై అప్పీల్‌కు వెళ్తున్నట్లు స్పష్టం చేసింది.

2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి కాలానికి సంబంధించి జీఎస్టీ డిమాండ్‌ను నిర్ధారిస్తూ కంపెనీకి జూన్ 9న ఒక ఆర్డర్ అందింది. అయితే, ఈ విషయంలో మా వాదనలో బలమైన అంశాలు ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాము. కంపెనీ ఈ ఉత్తర్వుపై సంబంధిత అధికార సంస్థ ముందు అప్పీల్ దాఖలు చేస్తుంది” అని ఎటెర్నల్ సంస్థ తన ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ నోటీసుల వల్ల కంపెనీ ఆర్థిక కార్యకలాపాలపై గానీ, ఇతర కార్యకలాపాలపై గానీ ఎలాంటి ప్రతికూల ప్రభావం పడబోదని కూడా స్పష్టం చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP GST department
  • Online food delivery tax
  • zomato
  • Zomato GST Notice

Related News

That is the very day the 'Thalliki Vandanam' money gets credited!

Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

మరికొన్ని రోజులలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలు చేస్తారా అనే ఆసక్తి విద్యార్థుల తల్లిదండ్రులలో నెలకొంది. ఈ నేపథ్యంలో తల్లికి వందనం పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం పథకం అర్హుల జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందించాలంటూ అధికారులను ఆదేశించారు. పాఠశాలలు తెరుచుకున్న రోజే విద్యార్థులకు యూనిఫా

  • Centre sanctions massive funds for AP: Union Minister Pemmasani Chandra Sekhar

    Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

  • Central government showering blessings on Amaravati

    Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

  • Ap Logo

    Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

Latest News

  • Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

  • Zomato: జొమాటో కు షాక్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 9.6 కోట్ల జీఎస్‌టీ నోటీసు

  • TRS పార్టీ మాదే..కవిత పార్టీకు మరో బిగ్ షాక్ ..ఈసీ ట్విస్ట్

  • Mahender Makhijani: అమెరికాలో బ్యాంకు మోసం ఏకంగా రూ. 950 కోట్లు.. భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్‌

  • ICC Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd