HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Mla Dbv Swami Fires On Cm Jagan

TDP : ప‌ర్చూరులో హ్యాట్రిక్ కొడతాం.. రాజకీయంగా ఎదుర్కోలేక ఎమ్మెల్యే ఏలూరి పై కుట్ర : ఎమ్మెల్యే డీబీవీ స్వామి

బలమైన నేతగా ఉన్న తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుని రాజకీయంగా

  • Author : Prasad Date : 29-01-2024 - 8:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP Yeluri
TDP Yeluri

బలమైన నేతగా ఉన్న తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనపై బురద చల్లేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని కొండేపి శాసనసభ్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. పర్చూరు నియోజకవర్గంలో గెలవలేమనే భయంతో ఏదో ఒక రకంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రతిష్టను దిగజార్చాలని కుట్రతో దిగజారుడు రాజకీయానికి ప్రభుత్వ పెద్దలు తెరలైపారని మండిపడ్డారు. రాజకీయంగా ఏలూరిని ఎదుర్కొనే అభ్యర్థి దొరక్కపోవడం, ఏలూరిపై నిలబడే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు లేకపోవడం వైసీపీకి శాపంగా మారిందన్నారు. దీంతో తాడేపల్లి పెద్దలు ఏలూరిని ఇబ్బందులకు గురి చేయాలనే లక్ష్యంతో అధికార దర్పాన్ని వినియోగించి కుట్రలకు తెర‌లేపార‌ని మండిపడ్డారు. 15 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే ఏలూరి నోవా అగ్రి గ్రూప్ సంస్థను స్థాపించారని, రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆ సంస్థ నుంచి బయటికి వచ్చారని తెలిపారు. ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా పలువురు డైరెక్టర్ల ఆధీనంలో నోవా నడుస్తుందన్నారు. ఆ కంపెనీలో లోటుపాట్లు ఉంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

అక్రమ మార్గంలో గెలవాలని తలంపుతో ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఏలూరి పోరాటం సాగించారని ఆ కక్షతోనే కుట్రలు చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ పుట్టకే విధ్వంసంతో ప్రారంభమైందని అలాంటి ప్రభుత్వం నీతి నిజాయితీగా ప్రజా సేవ చేస్తున్న ఎమ్మెల్యే ఏలూరిపై ఇలాంటి ప్రచారం చేయడం తగదన్నారు. నోవా గ్రూప్ సంస్థ ఐ పీ ఓ (తొలి పబ్లిక్ ఆఫర్)లో అడుగుపెట్టిందనే కక్షతో అధికారం అడ్డం పెట్టుకొని దాడుల పేరుతో ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసిన ఎమ్మెల్యే ఏలూరి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని పేర్కొన్నారు. జగన్ రెడ్డి కుట్రలు ప్రజలందరికీ తెలుసునని .. ఎమ్మెల్యే ఏలూరి అంటే ప్రజల్లో ఒక విశ్వాసం ఉందన్నారు. సీఎం కార్యాలయం తాడేపల్లి నుంచి ఎమ్మెల్యే ఏలూరిపై కుట్రలకు డైరెక్షన్ చేస్తున్నారని అవి పర్చూరులో సాగవన్నారు. గతంలో సైతం హెరిటేజ్ సంస్థలపై బురద చల్లిన ప్రభుత్వ పెద్దలు తాజాగా ఎమ్మెల్యే ఏలూరి స్థాపించిన సంస్థలపై బురద చల్లుతున్నారని పేర్కొన్నారు. ఎప్పటికైనా వైసీపీ పెద్దలు ఎమ్మెల్యే ఏలూరిపై చీప్ పాలిటిక్స్ మానుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలన్నారు.రానున్న ఎన్నికల్లో పర్చూరు నుంచి వైసీపీ అంతిమయాత్ర ప్రారంభమవుతుందని హెచ్చరించారు. పర్చూరు ప్రజల్లో ఎమ్మెల్యే ఏలూరిపై ఉన్న నమ్మకం ప్రేమ ఆప్యాయతలు చెరిపేందుకు చేస్తున్న కుట్రలు ఎన్నికల్లో పటాపంచలవుతాయన్నారు.

Also Read:  TDP : తిరువూరు టీడీపీ అభ్య‌ర్థిగా కొలిక‌పూడి శ్రీనివాస్‌.. త్వ‌ర‌లో అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న అధిష్టానం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra CM Jagan
  • andhra pradesh
  • ap tdp
  • cm jagan
  • MLA Sambasivarao
  • parchuru
  • tdp
  • ysrcp

Related News

CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఉద్యోగులు వినూత్నంగా ఆలోచనలు చేసేలా ప్రోత్

  • CM Chandrababu

    CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • TDP

    TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

Latest News

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

  • Allu Arjun : ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటనలో కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్

  • Radha Gayatri: టెకీ రాధా గాయత్రి చివరి ఆడియో.. వెలుగులోకి కీలక విషయాలు

  • Tension Stress: మనకు వచ్చే టెన్షన్, ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd