HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Mahanadu With The Theme Womens Empowerment Politburo Approves Resolutions

Mahanadu 2026: ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో టీడీపీ మహానాడు.. తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!

  • Author : Vamsi Chowdary Korata Date : 22-05-2026 - 9:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP Mahanadu with the Theme 'Women's Empowerment' — Politburo Approves Resolutions!
TDP Mahanadu with the Theme 'Women's Empowerment' — Politburo Approves Resolutions!

తెలుగుదేశం పార్టీ ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు ఈసారి ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో జరగనుంది. ఈ మేరకు పార్టీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. మే 27, 28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో జరగనున్న మహానాడులో మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టాలని తీర్మానించింది. గురువారం నాడు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం వర్చువల్ పద్ధతిలో జరిగింది. ఇంధన పొదుపు చర్యలలో భాగంగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి చంద్రబాబు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పాల్గొనగా, మిగిలిన పొలిట్ బ్యూరో సభ్యులు వివిధ ప్రాంతాల నుంచి ఆన్‌లైన్‌లో హాజరయ్యారు.

సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో మహానాడు నిర్వహణ, అజెండాపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మహానాడులో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలపై చంద్రబాబు కీలక సూచనలు చేశారు. మొత్తం 20 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 10, తెలంగాణకు 4, అండమాన్‌కు 1 తీర్మానం ఉన్నాయి. వీటితో పాటు నాలుగు ఉమ్మడి తీర్మానాలు, చివరగా ఒక కీలక రాజకీయ తీర్మానాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

ఈ ఏడాది మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహించాలని నిర్ణయించినందున, కార్యక్రమం మొత్తం ఆ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు, వారి హక్కులకు టీడీపీ కట్టుబడి ఉందని, ఆ విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలోనూ మహిళలనే భాగస్వాములను చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

వీటితో పాటు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల వంటి అంశాలపై మహానాడులో కూలంకషంగా చర్చ జరగాలని ఆదేశించారు. ‘మన దేశం-మన బాధ్యత’ పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న పొదుపు చర్యలపైనా ప్రత్యేకంగా చర్చించాలని సూచించారు.

రాష్ట్రంలో ‘ప్రత్యర్థి పార్టీ’ పేరిట జరుగుతున్న అరాచకాలను, కుట్రలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, వారిలో అవగాహన పెంచేలా మహానాడు కార్యక్రమాలు ఉండాలని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. ఎన్టీఆర్ సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ చరిత్రను నేటి తరానికి తెలియజేసేలా ప్రత్యేక ప్రజెంటేషన్లు ఇవ్వాలని కూడా నిర్ణయించారు.

హైబ్రిడ్ పద్ధతిలో ఈసారి మహానాడు జరుగుతున్నప్పటికీ, దాని స్ఫూర్తి మాత్రం తగ్గకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. మహానాడును ఒక పండుగలా నిర్వహించాలని, రెండు రోజుల ముందు నుంచే ప్రతి ఇంటిపైనా టీడీపీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అగ్ర నాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. అన్ని క్లస్టర్లలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మహానాడును ప్రారంభించాలని పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • andhra pradesh politics
  • Education Minister Nara Lokesh
  • Mahanadu 2026
  • Stri Shakti Theme
  • tdp mahanadu
  • telugu desam party

Related News

Bhaskar Award Could Be Given to YS Jagan: Nara Lokesh

Nara Lokesh: వైఎస్ జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు : నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘గొడ్డలి పార్టీ’, ‘హత్యా రాజకీయాలు’ అనే అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్‌కు చేరింది. నిన్న వైసీపీ అధినేత జగన్ ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు… ఈరోజు కడపలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి తాను కొత్తగా ‘గొడ్డలి పార్టీ’ అని పేరు పెడి

  • Another massive investment in AP.

    AP News: ఏపీలో మరో భారీ పెట్టుబడి..

  • CM Chandrababu and his wife stopped by the roadside to eat ice apples.

    CBN In Kuppam: రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తిన్న సీఎం చంద్రబాబు దంపతుల

  • Fans Chant:

    Jr NTR సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు

  • Mounika to Contest Upcoming Elections: Manchu Manoj Clarifies

    Bhuma Mounika Reddy: వచ్చే ఎన్నికల్లో మౌనిక అక్కడి నుంచే పోటీ.. క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్‌

Latest News

  • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

  • Vijayawada: అమ్మాయి కోసం నడిరోడ్డుపై ఫైట్

  • Gold Price Today: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్ ..

  • Vitamin B12: విటమిన్ బి12 లోపం ఉందన్న విషయం మీ నడక చెబుతుంది!

  • Vijaya Sai Reddy: తమిళనాడు రాజకీయాలపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd