TDP : తిరువూరులో అర్థరాత్రి పోలీసుల హైడ్రామా.. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మునియ్య అరెస్ట్
సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు. విద్యాదీవెన పథకానికి సంబంధించిన నిధులను
- By Prasad Published Date - 07:46 AM, Sun - 19 March 23

సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు. విద్యాదీవెన పథకానికి సంబంధించిన నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తిరువూరులో సుధీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలపై టీడీపీ నేతలు పోరాటం చేస్తున్నారు. సీఎం పర్యటనలో నియోజకవర్గ సమస్యలపై సీఎంను నిలదీసేందుకు జిల్లా ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య సిద్ధమైయ్యారు. దీంతో అర్థరాత్రి వాసం మునియ్య ఇంటివద్ద హైడ్రామా నెలకొంది. సీఎం పర్యటన నేపథ్యంలో వాసం మునియ్యను పోలీసులు అర్థరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారు. ఫోన్లు సైతం లాక్కుని.. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా కుటుంబసభ్యులకు తెలపకుండా పోలీసులు వ్యవహరించారు. దీంతో కుటుంబసభ్యులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. తిరువూరు నియోజకవర్గం సీఎం జగన్‌కు సమస్యలతో స్వాగతం పలుకుంది. ఏ.కొండూరు కిడ్నీ బాధితుల కష్టాలు, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయకపోవడం, వినగడప వద్ద కట్టేలరు వంతెన నిర్మాణం లాంటి వాటిని పూర్తి చేయాలని మునియ్య డిమాండ్ చేశారు.
ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరువూరు పర్యటనలో ఎన్నికల సంధర్భంగా ఇచ్చిన హామీలను ఒకటి కూడా అమలు చేయకుండా ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు తిరువూరు పర్యటన ఏవిధంగా వస్తూన్నారని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా రక్షణనిధి ఏనాడైనా నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ డీగ్రీ కళాశాలలో మౌలిక వసతులు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకున్న పరిస్థితులు లేవని.. కళాశాలలో పర్యటన చేసిన సంధర్భం లేదన్నారు. కానీ ఇప్పుడు జగనన్న విద్యా దీవెనకు సీఎం జగన్ ని తిరువూరుకు తీసుకువచ్చి బటన్ నొక్కిస్తాన్నావ్ తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. స్థానికేతురుడైన ఎమ్మెల్యే రక్షణనిధి ఈ నియోజకవర్గంలో ఎన్ని కళాశాలలున్నాయో.. ఎంతమంది విద్యార్థులు ఉన్నారో కూడా తెలియదన్నారు.

Related News

Kotamreddy Giridhar Reddy : పసుపుమయమైన నెల్లూరు.. నేడు టీడీపీలో చేరనున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కోటంరెడ్డి బ్రదర్స్ టీడీపీలోకి వస్తున్నారు. నేడు మంగళగిరి కేంద్ర