TDP : కృష్ణాజిల్లాలో టీడీపీకి షాక్.. వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే
కృష్ణాజిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. కైకలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అధికార వైసీపీలో
- Author : Prasad
Date : 13-02-2023 - 10:49 IST
Published By : Hashtagu Telugu Desk
కృష్ణాజిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. కైకలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అధికార వైసీపీలో చేరనున్నారు. ఎమ్మెల్సీ పదవి హామీతో నేడు సీఎం జగన్ సమక్షంలో ఆయన చేరనున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు నలుగురు గన్ మ్యాన్లతో భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.అయితే ఈ సమాచారం తెలుసుకున్న కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు హుటా హుటీన కేంద్ర పార్టీ కార్యాలయానికి బయల్దేరారు.
జయమంగళ వెంకటరమణ 2009లో టీడీపీ నుంచి గెలిచారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ ఎలాంటి పదవి జయమంగళకు ఇవ్వలేదు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కినప్పటికీ ఆయన ఓడిపోయారు. అయితే మూడున్నరేళ్ల తరువాత ఆయన వైసీపీలోకి వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో పొత్తు ఉంటే కామినేనికి టికెట్ ఇస్తారనే భావనలో జయమంగళ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీలోకి వెళ్తున్నారని.. ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సుముఖంగా ఉండటంతో ఆయను పార్టీలో చేరుతున్నారని సన్నిహితులు చెప్తున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాత్రం ఆయన చేరికను వ్యతిరేకిస్తున్నారు.