TDP MLC Candidates: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ!
యువతను ప్రోత్సహించడం, మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో ఎస్సీ సామాజికవర్గం నుంచి శ్రీకాకుళానికి చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు పార్టీ అవకాశం ఇచ్చింది.
- By Gopichand Published Date - 09:01 PM, Sun - 9 March 25

TDP MLC Candidates: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను (TDP MLC Candidates) తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయడులను ఎంపిక చేయడం జరిగిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: TPCC President: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు శుభాకాంక్షలు: టీపీసీసీ అధ్యక్షులు
ఎమ్మెల్సీ స్థానాల్లో బలహీన వర్గాలకే పెద్దపీట
• టీడీపీ ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను బలహీన వర్గాలకే కేటాయించింది.
• వెనకబడిన వర్గాలను ఆది నుంచి ఆదరిస్తున్న టీడీపీ తాజాగా ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించింది.
• 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను… pic.twitter.com/SEjA8MFlyR— Telugu Desam Party (@JaiTDP) March 9, 2025
ఎమ్మెల్సీ స్థానాల్లో బలహీన వర్గాలకే పెద్దపీట
• టీడీపీ ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను బలహీన వర్గాలకే కేటాయించింది.
• వెనకబడిన వర్గాలను ఆది నుంచి ఆదరిస్తున్న టీడీపీ తాజాగా ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించింది.
• 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను పొత్తులో భాగంగా రెండు సీట్లు జనసేన, బీజేపీకి కేటాయించగా మిగిలిన 3 సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది.
• అందులో రెండు బీసీలకు, ఒకటి ఎస్సీకి టీడీపీ అధిష్టానం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
• మూడు ప్రాంతాల్లోంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసింది.
• రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజికవర్గ నేత బీటీ నాయుడుకి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది.
• పార్టీలో మొదటి నుంచీ అంటిపెట్టుకుని ఉన్న బీదా రవిచంద్రకు కూడా పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది.
• యువతను ప్రోత్సహించడం, మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో ఎస్సీ సామాజికవర్గం నుంచి శ్రీకాకుళానికి చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు పార్టీ అవకాశం ఇచ్చింది.
• టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన ముగ్గురు నేతలూ బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారిని బట్టి చూస్తే ఆ వర్గాలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యత ఏంటనేది మరోసారి స్పష్టమైంది.