HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sit Finds Out What Midhun Reddy Did In Ap Liquor Scam

Mithun Reddy : ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి పాత్ర.. కీలక వివరాలివీ

మిథున్‌రెడ్డి(Mithun Reddy)  ఆదేశాల మేరకు 2019 డిసెంబరులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లు రాజ్‌ కసిరెడ్డిని కలిశారు. తాము చెప్పిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు ఇవ్వాలని రాజ్‌ నిర్దేశించారు.

  • Author : Pasha Date : 24-05-2025 - 9:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Liquor Scam Mithun Reddy Midhun Reddy Ysrcp Sit Andhra Pradesh

Mithun Reddy : వైఎస్సార్ సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్ స్కాంపై ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) విచారణ వేగంగా జరుగుతోంది. ఈ స్కాంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పాత్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని సిట్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది.  ఓ వైపు ముడుపుల వసూళ్లు.. మరోవైపు సొంత బ్రాండ్ల మద్యానికి ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చుకోవటం ద్వారా మిథున్‌రెడ్డి రెండు విధాలుగా అనుచిత లబ్ధి పొందారని సిట్‌ గుర్తించింది. లిక్కర్ డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రాజ్‌ కెసిరెడ్డితో కలిసి హవాలా నెట్‌వర్క్‌‌ను తయారు చేయడంలో, వసూలు చేసిన ముడుపుల్ని  ఆనాటి ప్రభుత్వ పెద్దలకు చేర్చటంలో మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్‌  తేల్చింది. అందుకే ఈ స్కాంలో మిథున్ రెడ్డిని ఏ4గా చేర్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా అరెస్టయిన నిందితుల రిమాండు రిపోర్టుల్లో, మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్‌లోనూ ఈ అంశాలను సిట్‌ ప్రస్తావించింది.

Also Read :Pakistan Vs IndiGo : ‘ఇండిగో‌’పై పాక్ నిర్దయ.. 227 మంది ప్రాణాలతో చెలగాటం.. ఏమైందంటే ?

మిథున్‌రెడ్డి‌పై సిట్‌ అభియోగాలివీ.. 

  • ఐఆర్‌టీఎస్‌ అధికారి వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీగా, డిస్టిలరీస్, బ్రూవరీస్‌ కమిషనర్‌గా నియమించడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ గుర్తించింది.
  • ఎక్సైజ్‌ శాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేసే డి.సత్యప్రసాద్‌ను తిరుపతిలోని తన నివాసానికి మిథున్‌రెడ్డి పిలిపించుకొని.. తాము చెప్పినట్లుగా చేస్తే కన్ఫర్డ్‌ ఐఏఎస్‌గా పదోన్నతి ఇప్పిస్తానని ప్రలోభపెట్టారు.
  • వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లను 2019 అక్టోబరు 13న హైదరాబాద్‌లోని విజయసాయిరెడ్డి నివాసానికి మిథున్ రెడ్డి పిలిపించుకున్నారు.  అంతకుముందు సంవత్సరాల్లో ఏపీలో జరిగిన మద్యం విక్రయాల వివరాలపై చర్చించారు.  ఈ మీటింగ్‌లో మిథున్‌రెడ్డి, రాజ్‌ కసిరెడ్డి, ఆయన తోడల్లుడు ముప్పిడి అవినాష్‌రెడ్డి, విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. లిక్కర్ ముడుపుల ద్వారా నెలకు రూ.60 కోట్ల దాకా పొందొచ్చని ఈ సమావేశంలో మిథున్‌రెడ్డి, కసిరెడ్డి నిర్ణయించారు.
  • బ్రాండ్ల మూల ధర ఆధారంగా..  ఒక్కో లిక్కర్ కేసుకు రూ.150 నుంచి రూ.600 దాకా ముడుపులు వసూలు చేయొచ్చని డిసైడ్ చేసుకున్నారు.
  • మిథున్‌రెడ్డి(Mithun Reddy)  ఆదేశాల మేరకు 2019 డిసెంబరులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లు రాజ్‌ కసిరెడ్డిని కలిశారు. తాము చెప్పిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు ఇవ్వాలని రాజ్‌ నిర్దేశించారు.
  • మిథున్‌రెడ్డి ఎస్పీవై డిస్టిలరీస్‌ సహా మరికొన్నింటిలో తన సొంత బ్రాండ్ల మద్యాన్ని తయారు చేయించి ఏపీఎస్‌బీసీఎల్‌తో కొనుగోలు చేయించారు. వాటికి మూల ధరలు విపరీతంగా పెంచుకుని లాభపడ్డారు.
  • ముడుపులిచ్చే మద్యం కంపెనీల బ్రాండ్లకే ఎక్కువగా ఆర్డర్లు దక్కేలా ఇండెంట్లు పెట్టించేవారు. ఈ ఆర్డర్లు పొందే  డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి రాజ్‌ కసిరెడ్డి బృందం ఐదురోజులకోసారి ముడుపులు వసూలు చేసేది.
  • ముడుపులు వసూలవుతున్నాయా అనేది పర్యవేక్షించేందుకు మిథున్‌రెడ్డి తరచూ సమావేశాలు నిర్వహించేవారు.
  • రాజ్‌ కసిరెడ్డి తాను వసూలు చేసిన ముడుపులను మిథున్‌రెడ్డితో పాటు నాటి ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన మరికొందరికి ఇచ్చేవారు. వారంతా దాన్ని పెద్దలకు చేరవేసేవారు.
  • ఈ ముడుపుల్లో ఎక్కువ భాగం బంగారం, నగదు రూపంలోనే ఉండేది.

Also Read :Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Liquor Scam
  • AP SIT
  • midhun reddy
  • Mithun Reddy
  • ysrcp

Related News

TDP

TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినప్పటికీ, నిరుద్యోగ యువతలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు, ఎక్కడ తప్పు జరిగిందో ఆధారాలతో నిరూపించాలని స

  • Key turn in AP liquor scam case... Former Minister Karumuri's son arrested.

    Karumuri Sunil: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

Latest News

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd