HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >How Iaf Helped Delhi Srinagar Indigo Plane To Land Safely After Pakistan Airspace Was Denied

Pakistan Vs IndiGo : ‘ఇండిగో‌’పై పాక్ నిర్దయ.. 227 మంది ప్రాణాలతో చెలగాటం.. ఏమైందంటే ?

ప్రస్తుతం భారత్ కోసం పాకిస్తాన్(Pakistan Vs IndiGo)  తన గగనతలాన్ని మూసేసింది.

  • By Pasha Published Date - 08:41 AM, Sat - 24 May 25
  • daily-hunt
Indigo Plane Pakistan Airspace Iaf Indian Air Force Delhi Srinagar India

Pakistan Vs IndiGo : అది ఇండిగో 6ఇ 2142 విమానం. బుధవారం రోజు ఢిల్లీ నుంచి జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌కు బయలుదేరింది. అకస్మాత్తుగా మార్గం మధ్యలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ వద్ద ఉరుములు, మెరుపులతో కూడిన కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీంతో విమానంలో ప్రయాణికులు హడలిపోయారు. ఆ పరిస్థితుల్లో విమానం ముందుకు సాగితే.. ప్రయాణికుల ప్రాణాలకే గండం. కాస్తంత దారి మార్చి పక్కకు వెళ్దామంటే.. పాకిస్తాన్ గగనతలం ఉంది. ప్రస్తుతం భారత్ కోసం పాకిస్తాన్(Pakistan Vs IndiGo)  తన గగనతలాన్ని మూసేసింది. అయినా ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు విమానాన్ని పాకిస్తాన్ గగనతలంలోకి కాసేపు  తీసుకెళ్లడానికి పైలట్లు ట్రై చేశారు.

Also Read :Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

కనికరం చూపని పాకిస్తాన్

అయితే పాకిస్తాన్‌లోని లాహోర్‌‌లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విభాగం అధికారులు కనికరం చూపలేదు.  నో చెప్పారు.  దీంతో పైలట్లు విమానాన్ని  ఉరుములు, మెరుపులతో కూడిన భారత గగనతలంలోని కారుమబ్బుల్లోకి తీసుకెళ్లారు. విమానం నిమిషానికి 8,500 అడుగుల వేగంతో కిందకి దిగడం మొదలైంది. సాధారణంగానైతే ఆ వేగం 1,500 నుంచి 3వేల అడుగుల మధ్యే ఉంటుంది. మరోవైపు వడగళ్లు బలంగా విమానాన్ని తాకసాగాయి. విమానం భారీ కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులు వణికిపోయారు.  హాహాకారాలు మొదలుపెట్టారు. అయినా పైలట్లు ధైర్యం కోల్పోలేదు. చాకచక్యంగా విమానాన్ని పూర్తి కంట్రోల్‌తో నడిపి శ్రీనగర్‌ రన్‌వేపై దించారు.

Also Read :Kavitha vs KCR : ‘కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ దయ్యాలు ‘ ఉన్నాయి – కవిత

భారత వాయుసేన సాయం చేయడంతో..

ఈ కల్లోలం తీవ్రతకు విమానం ముందు భాగంలో ఉండే రాడోమ్‌ దెబ్బతింది. ఇందులో వాతావరణ రాడార్‌ ఉంటుంది. మొత్తం మీద విమానంలోని 227 మంది ప్రయాణికుల ప్రాణాలను పైలట్లు కాపాడారు. ఈ ఘటన వివరాలను తాజాగా భారత పౌరవిమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) మీడియాకు విడుదల చేసింది. లాహోర్‌ ఏటీసీ నిరాకరించినప్పటి నుంచి ఇండిగో విమానం శ్రీనగర్‌లో సురక్షితంగా దిగేవరకూ తాము తోడ్పాటు అందించామని భారత వాయుసేన వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • iaf
  • india
  • Indian Air Force
  • IndiGo plane
  • Pakistan Airspace
  • Pakistan Vs IndiGo
  • Srinagar

Related News

Trade War

Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

Trade War : భారత్–అమెరికా సంబంధాలు మళ్లీ కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల సుంకాల (టారిఫ్‌) వివాదం కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

  • Upendra Dwivedi

    Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

  • Nara Lokesh Pm Modi Yuvagalam Coffee Table Book Tdp Ap Govt

    Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ

  • Trump Is Dead

    Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్

  • Nirmalabhatti

    Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

Latest News

  • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

  • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd