HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sharmila Is A Weapon In The Hands Of The Congress

Sharmila : కాంగ్రెస్ చేతిలో షర్మిల అస్త్రం

జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల (Sharmila) అతనికి ఎదురు తిరుగుతారని ఎవరూ కలలో కూడా అనుకోని ఉండరు. అనుకోనిది జరగడమే రాజకీయ చిత్రం.. విచిత్రం.

  • Author : Hashtag U Date : 30-12-2023 - 12:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sharmila Is A Weapon In The Hands Of The Congress
Sharmila Is A Weapon In The Hands Of The Congress

By: డా. ప్రసాదమూర్తి

YS Sharmila, A weapon of the Congress Party : ఊహించని మలుపులు తిరిగేదే రాజకీయం. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని ఆనాడు ఎవరూ ఊహించ లేదు. అలాగే ఆయన ఏ పార్టీ కోసం అయితే జీవితాంతం కష్టపడి పని చేశారో ఆ పార్టీని ఆయన కుమారుడే విడిచిపెడతాడని ఎవరూ భావించలేదు. రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టి అంతటి ఘన విజయం సాధిస్తాడని అసలెవరూ అనుకోలేదు. ఇదంతా ఒక ఎత్తు. జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల (Sharmila) అతనికి ఎదురు తిరుగుతారని ఎవరూ కలలో కూడా అనుకోని ఉండరు. అనుకోనిది జరగడమే రాజకీయ చిత్రం.. విచిత్రం. వైయస్ షర్మిల (YS Sharmila) ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను విడిచి తెలంగాణలో వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసి వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి తన రాజకీయ అస్తిత్వాన్ని చాటుకోవాలని ఎంతగానో కష్టపడింది. అయితే ఆమెకు కనుచూపుమేరలో కూడా తన కష్టానికి ఫలితం దక్కే అవకాశాలు కనిపించలేదు. దానితో ఆమె కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది.

We’re now on WhatsApp. Click to Join.

ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తెలంగాణ ఎన్నికల సమయంలో అంతా రంగం సిద్ధమైందని అందరూ భావించిన వేళ, సీట్ల సర్దుబాటు విషయంలో షర్మిల చేసిన డిమాండ్లు కాంగ్రెస్ అధిష్టానానికి నచ్చకపోవడంతో ఆమె పార్టీలో చేరిక తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే షర్మిల తెలివిగా తెలంగాణలో తన పార్టీ నుంచి ఏ అభ్యర్థినీ పోటీకి నిలిప లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి ఆమె పట్ల అభిమానం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. అయితే ఇప్పుడు షర్మిల భవిష్యత్తు ఏమిటి.. షర్మిలకు ఎంపీ సీటు ఇస్తారా.. లేక రాజ్యసభకు పంపిస్తారా అనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే, షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి ఆమె కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలే ఎక్కువగా ఇప్పుడు సాగుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైయస్ జగన్ తో సోదరి షర్మిల వైరి వర్గంలో చేరి పోరు సాగించబోతుందన్న మాట.

అందరూ అనుకుంటున్నట్టుగా వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీ తప్పకుండా ఆమెను ఆంధ్ర ప్రదేశ్లో తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఒక బలమైన అస్త్రంగా ప్రయోగించే అవకాశం ఉంది. ఆమెను ఆంధ్ర ప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలుగా చేయవచ్చని, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బాధ్యత పూర్తిగా ఆమెకు అప్పజెప్పవచ్చునని పలు రకాల కథనాలు మీడియాలో వస్తున్నాయి. వీటిని షర్మిల గాని కాంగ్రెస్ పార్టీ గాని ఖండించలేదు. అంతేకాదు షర్మిల నారా లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు. అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం తరఫున పంపించినట్టుగా ఆమె పేర్కొన్నారు. దానికి బదులుగా లోకేష్ నారావారి కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేయడం కూడా ఒక పెద్ద వార్తగా వైరల్ అయింది. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం, అటు కర్ణాటకలో కూడా విజయం సాధించడం, దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టు ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో షర్మిలను ఏపీలో రంగంలోకి దింపడానికి కాంగ్రెస్ యోచించడం నిజమేనని అందరూ భావిస్తున్నారు.

Also Read:  MLC Vamsi Krishna : రాజకీయాల్లోకి వచ్చి 60 ఎకరాలు అమ్ముకున్న – విశాఖ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ

ఇదే జరిగితే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోనే రణ రంగానికి నేపథ్యం సిద్ధమైనట్టు అర్థమవుతుంది. అంటే ఏపీలో అన్నాచెల్లెళ్ల మధ్య భీకర పోరాటానికి తెర లేవనుంది. ఎన్నికలలో పోటీ అంటే అది కేవలం రాజకీయాలకే పరిమితం కాదు. ఒకరిని ఒకరు దూషించుకోవడం, ద్వేషించుకోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఎన్నికల రాజకీయాలలో అతి సామాన్య విషయం. షర్మిల ఏపీలో రంగంలోకి దిగితే ఆమె ఎందుకు జగన్తో వైరం పెంచుకుందో ఆ కారణాలు బయటపడే అవకాశం ఉంది. వివేకా హత్య కేసుకు సంబంధించి షర్మిలకు చాలా సందేహాలు ఉన్నాయి. ఆమెకు చాలా విషయాలు తెలుసునన్న సంగతి అందరికీ అర్థమైంది. జగన్ కి షర్మిలకీ మధ్య ప్రత్యక్ష పోరాటం మొదలైతే రాజకీయాల మాటెలా ఉన్నా, వారి కుటుంబంలోని అతి రహస్యమైన విషయాలు కూడా బయటపడే అవకాశం ఉన్నట్టు పలువురు భావిస్తున్నారు. అంతేకాదు ఒకప్పుడు జగన్ కి వైయస్సార్ పై ఉన్న అభిమానంతో ప్రజలు ఓట్లు వేశారు. అదే వైయస్సార్ ముద్దుల కూతురు షర్మిల ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగితే ఆమె పట్ల కూడా ప్రజలు సానుభూతి ప్రదర్శించే అవకాశం ఉందా.. ఉంటే అది ఏ మేరకు ఉంటుంది.. సొంత ఇంట్లోనే మొదలైన ఈ పోరును జగన్ ఏ విధంగా పరిష్కరించుకుంటారు.. లేక రాజకీయంగా తన సోదరిని ఎదుర్కొనే శక్తితో నమ్మకంతో ఆయన ముందుకు పోతారా.. ఇలాంటి చాలా అంశాలు ఇంకా స్పష్టంగా తేలాల్సి ఉంది.

ఏది ఏమైనప్పటికీ వాతావరణం చూస్తుంటే అన్నాచెల్లెళ్ల మధ్య యుద్ధం తప్పదనేటటువంటి సంకేతాలు మాత్రమే అందుతున్నాయి. ఏపీ ప్రజల నుంచి జగన్ కు అందిన సానుభూతి అభిమానం, వైయస్సార్ కుటుంబం పట్ల ప్రజలు చూపించిన ప్రేమ అదే మోతాదులో షర్మిల పట్ల కూడా వ్యక్తం అవుతుందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎవరి ప్రభావం ఎంత ఉంటుంది.. షర్మిలతో కాంగ్రెస్ కి ఎంత లాభం.. తెలుగుదేశం పార్టీకి ఎంత లాభం.. జగన్ కి ఎంత నష్టం అనేది ముందు ముందు చూడాలి.

Also Read:  TDP Win : టీడీపీ, జనసేన కూటమికి 115 సీట్లు.. సంచలన సర్వే నివేదిక


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • INC
  • india
  • rahul gandhi
  • sharmila
  • Weapon

Related News

Venezuela Hands Over 50M Barrels Of Oil To USA

అమెరికా చేతికి వెనిజులా చమురు నిల్వలు..!భారత్‌కు అమ్మేందుకే అమెరికా సిద్ధం ?

Venezuela Hands Over 50M Barrels Of Oil To USA అంతర్జాతీయ ఇంధన రాజకీయాలను మలుపు తిప్పేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన పావు కదిపారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా ముడి చమురుపై ఆధార పడుతున్న భారత్‌కు.. వాషింగ్టన్ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రత్యామ్నాయాన్ని చూపింది. వెనిజులా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకున్న తర్వాత.. ఆ దేశ చమురు నిల్వలను తన నియంత్రణలోకి తెచ్చుకున్న అమె

  • Ktr Comments Revanth

    నా మీద కాదు, మీ సీఎం పై అరవ్వండి అంటూ కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ సూచన

  • donald trump modi

    డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

  • Mustafizur Rahman

    కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

  • Sonia Gandhi Hsp

    ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ, పార్టీ శ్రేణుల్లో ఖంగారు !!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ విముఖత, స్పందించిన భారత ప్రభుత్వం!

  • నేటి నుంచే ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌.. తొలి మ్యాచ్ ఏ జ‌ట్ల మ‌ధ్య అంటే?

  • సంక్రాంతి వేడుకలు : ధింసా నృత్యం చేసిన పవన్ కళ్యాణ్

  • బిఆర్ఎస్ కు లభించిన మరో అస్త్రం! కాంగ్రెస్ కు మరో తలనొప్పి తప్పదా ?

  • మీ వెండి వ‌స్తువుల‌కు ఉన్న‌ నలుపును వదిలించుకోండి ఇలా?!

Trending News

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd