YCP : రా.7గంటలకు సంచలన నిజం బయటకు: వైసీపీ ట్వీట్
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఫిర్యాదురారైన సత్వవర్ధన్ ను బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులు వంశీని జైలుకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ జైలులో ఆయనతో ములాఖత్ అయ్యారు.
- By Latha Suma Published Date - 02:25 PM, Tue - 18 February 25

YCP: వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నట్లు వైసీపీ ట్వీట్ చేసింది. ఈరోజు రాత్రి 7 గంటలకు గన్నవరం కేసుకు సంబంధించిన నిజాన్ని బయటపెట్టబోతున్నాం. అతిపెద్ద రహస్యం బయటపడనుంది అని ట్వీట్ లో వైసీపీ రాసుకొచ్చింది. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఫిర్యాదురారైన సత్వవర్ధన్ ను బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులు వంశీని జైలుకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ జైలులో ఆయనతో ములాఖత్ అయ్యారు.
💣 BIG BLAST TODAY AT 7 PM!
The truth behind the Gannavaram case will be exposed. A major cover-up is about to be shattered!#TDPFakeNewsFactory#TruthWillPrevail
— YSR Congress Party (@YSRCParty) February 18, 2025
వల్లభనేని వంశీతో ములాఖత్ ముగిసిన అనంతరం మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంశీని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయి. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని.. కావాలనే తప్పుడు కేసుల్లో ఇరికించారని పేర్కొన్నారు. చంద్రబాబు కావాలనే పట్టాభిని గన్నవరం పంపించి ప్రెస్ మీట్ పెట్టించారు. వంశీకి బెయిల్ రాకూడదని.. నాన్ బెయిలబుల్ కేసుగా మార్చారు. మంగళగిరికి సత్యవర్థన్ పిలిపించి మరో కేసు పెట్టించారు. సత్య వర్థన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడట.. ఎవ్వడో చూశాడంట.. డబ్బును లాక్కొని పోయాడని తప్పుడు కేసు పెట్టించారు.
Read Also: Ranveer Allahbadia : ఇదంతా అసభ్యత కాకపోతే ఇంకేంటి..?: యూట్యూబర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
పట్టాభి ఇష్టానుసారంగా మాట్లాడటంతో వైసీపీ కార్యకర్తలు గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి చేశారు. కానీ ఆ దాడిలో వల్లభనేని వంశీ లేరని చెప్పారు. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచాది నీచంగా మాట్లాడారు. పట్టాభి, ఆయన అనుచరులు ఓ దళిత నేత పై దాడి చేశారు. అన్యాయం చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతాం అన్నారు. సప్త సముద్రాలు దాటినా ఎక్కడున్నా.. అన్యాయానికి శిక్ష పడేలా చేస్తామని జగన్ హెచ్చరించారు. తన సామాజిక వర్గంలో ఎవరైనా ఎదుగుతున్నారంటే చంద్రబాబు, లోకేష్ తట్టుకోలేరన్నారు. కొడాలి నాని, దేవినేని అవినాష్, బ్రహ్మ నాయుడు ఇలా ఎవరైనా ఎదిగితే.. వారిపై ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారని జగన్ తెలిపారు.
Read Also: Allu Arjun – Atlee Movie : అల్లు అర్జున్ కు జోడిగా దేవర బ్యూటీ..?