HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Senior Tdp Leader Ayyannapatrudu Announced His Political Retirement

Ayyanna Patrudu: పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించిన టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు!

Ayyanna Patrudu : విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎవ‌రూ ఊహించ‌ని స్టేట్మెంట్ ప్ర‌క‌టించారు

  • Author : Gopi Date : 02-11-2024 - 8:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ayanna Patrudu
Ayanna Patrudu

తెలుగుదేశం పార్టీ (TDP) పుట్టినప్పటి నుంచి అందులోనే ఉంటూ 40 ఏళ్ల‌కు పైగా రాజకీయాన్ని పూర్తి చేసుకున్న విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఎవ‌రూ ఊహించ‌ని స్టేట్మెంట్ ప్ర‌క‌టించారు. తన రాజకీయ జీవితానికి పూర్తి స్థాయిలో విరామం ప్రకటిస్తున్నట్లుగా ఆయన ప్ర‌క‌టించేశారు. తాను 2029 ఎన్నికల్లో పోటీ చేయను అని ప్ర‌స్తుతం స్పీకర్‌గా కొనసాగుతున్న అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇక పోటీ చేసే ప్రసక్తే లేదని అన్నారు.

జీవితంలో ఎన్నో విజ‌యాలు, అప‌జ‌యాలు చూశానన్న ఆయ‌న వ‌య‌సు మీద ప‌డుతోంద‌ని గుర్తు చేశారు. అలాగే ప‌దవులు ఎవ‌రికీ శాశ్వ‌తం కాద‌ని, ప్ర‌జ‌ల‌కు చేసిన మంచి మాత్ర‌మే జీవితాంతం గుర్తుంటుంద‌ని కార్య‌క‌ర్త‌ల‌కు దిశా నిర్దేశం చేశారు. అయితే అయ్య‌న్న‌పాత్రుడు స్థానంలో ఆయన పెద్ద కుమారుడి విజ‌య్‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి దింపుతార‌ని తెలుస్తోంది. విజ‌య్‌ను అయ్య‌న్న రాజ‌కీయ వార‌సుడిగా చూడాల‌ని అనుకుంటున్నారు. అయితే 2029 ఎన్నిక‌ల్లో అయ్య‌న్న‌పాత్రుడు కుమారుడే నర్సీపట్నంనియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బ‌రిలోకి ఉంటారని కార్య‌క‌ర్త‌లు సైతం ఆశిస్తున్నారు.ఇక‌పోతే అయ్యన్నపాత్రుడు 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024 శాసనసభ ఎన్నికలలో 7 సార్లు తెలుగుదేశం పార్టీ తరుపున నర్సీపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యాడు. 1984-1986లో సాంకేతిక విద్యా మంత్రిగా ఉన్న సమయంలో అయ్యన్న స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటుకు కృషిచేశారు. దీంతో పాటు ప్రభుత్వ సాంకేతిక శిక్షణ సంస్థ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు.

Read Also : Kerala : రైలు ఢీకొని నలుగురు రైల్వే కూలీల దుర్మరణం

1994-96 లో రహదారులు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామాల పరిధిలోని వందల కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్డును ఆర్‌అండ్‌బీకి బదలాయించి, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. 1996లో 11వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తరుపున అనకాపల్లి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.

1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలో వచ్చిన తరువాత అయ్యన్న అటవీశాఖ మంత్రి పదవిలో కొనసాగారు. ఆ సమయంలో నియోజకవర్గంలోని పెడిమికొండ నర్సరీ, ఆరిలోవ జౌషధ మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. 2004 ఎన్నికల్లో అయ్యన్న ఎమ్మెల్యేగా విజయం సాధించినా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఖాళీగా ఉన్నారు.

2014 ఎన్నికలలో శాసనసభ్యునిగా విజయం సాధించి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. అతను 1989, 2009, 2019లో అదే శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయారు. అతను 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశాడు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ 16 శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ విభజించిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవ స్పీకరుగా 2024 జూన్ 22న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Assembly Speaker
  • ap politics
  • ayyanna patrudu
  • Ayyanna Patrudu political retirement
  • tdp
  • Vijay Patrudu
  • viral news

Related News

NRI TDP

TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్‌ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd