Sabarimala Special Trains: అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్‌న్యూస్..!
శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే రెండు తెలుగు రాష్ట్రాల భక్తులకు రైల్యేశాఖ అధికారులు ఓ గుడ్‌న్యూస్ చెప్పారు.
- Author : Gopichand
Date : 12-11-2022 - 6:09 IST
Published By : Hashtagu Telugu Desk
శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే రెండు తెలుగు రాష్ట్రాల భక్తులకు రైల్యేశాఖ అధికారులు ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ నెల 20వ తేదీ నుంచి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా కొల్లాం, కొట్టాయానికి ప్రత్యేక రైళ్లను నడపనున్నామని ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ రైళ్లు తిరిగి కొల్లాం, కొట్టాయం నుంచి సికింద్రాబాద్‌కు నడుస్తాయన్నారు.
అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి నుంచి శబరిమలకు నడపనున్నారు. శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక రైలు నంబర్ 07117.. నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18, 25వ తేదీలలో అలాగే 2023 జనవరి 1, 8,15 తేదీలలో సికింద్రాబాద్ నుండి కొట్టాయం వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైలు ఆదివారం (నవంబర్ 20) సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరుతుంది. సోమవారం రాత్రి 9 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.
అదేవిధంగా ప్రత్యేక రైలు నంబర్ 07118 నంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీలలో కొట్టాయం నుండి సికింద్రాబాద్‌కు అందుబాటులో ఉంటుంది. అలాగే 2023 జనవరి 3, 10, 17 తేదీలలో అందుబాటులో ఉంటుంది. ఈ స్పెషల్ ట్రైన్ నవంబర్ 22 (మంగళవారం) రాత్రి 11.20 గంటలకు కొట్టాయం నుండి బయలుదేరి 1 గంటకు సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. భక్తులు ఈ రైళ్ల సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Sabarimala Special Trains@drmvijayawada @drmgtl @drmgnt #sabarimala #SpecialTrains pic.twitter.com/0Zdgif95c9
— South Central Railway (@SCRailwayIndia) November 9, 2022