PM Modi : ప్రధాని మోడీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు
అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో మోడీ(PM Modi) ప్రసంగిస్తారు.
- By Pasha Published Date - 07:12 AM, Mon - 28 April 25

PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆయన మే 2న అమరావతిలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి 15 నిమిషాల పాటు రోడ్ షోలో పాల్గొంటారు. గంట పాటు సభలో ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా మే 2న (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలీప్యాడ్‌కు వెళ్తారు. హెలీప్యాడ్ నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కి.మీ మేర రోడ్ షోలో మోడీ పాల్గొంటారు. ఈ రోడ్ షో 15 నిమిషాలపాటు కొనసాగుతుంది.
Also Read :DC vs RCB: ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు.. ఢిల్లీపై ఆర్సీబీ ఘనవిజయం!
షెడ్యూల్ ఇలా..
- 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్‌ను ప్రధాని సందర్శిస్తారు.
- సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుంది.
- అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో మోడీ(PM Modi) ప్రసంగిస్తారు.
- సాయంత్రం 5.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు.
- సాయంత్రం 5.20 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి ఢిల్లీకి తిరిగి వెళ్తారు.
- ఇక అమరావతి సభకు సంబంధించిన ప్రధాన వేదికపై 20 మంది మాత్రమే కూర్చుంటారు. ఈ వేదికపై ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా మొత్తం 20 మంది ఆసీనులు అవుతారు.
- మిగతా వీవీఐపీల కోసం మరో వేదిక ఉంటుంది. దీనిపై 100 మంది కూర్చుంటారు.
- ఇతర నేతల కోసం మరొక ప్రత్యేక వేదిక కూడా ఉంటుంది. మొత్తం మూడు వేదికలను ప్రధాని మోడీ సభ కోసం ఏర్పాటు చేస్తారు.
Also Read :Ginger Water: అల్లం ముక్కను నీటిలో మరిగించి ప్రతిరోజూ తాగితే ఆ సమస్యలు దూరం..
మోడీ పర్యటనకు ఏర్పాట్లు
- ఈరోజు రాత్రికల్లా అమరావతిలోని సభా ప్రాంగణం వద్ద పనులన్నీ పూర్తి అవుతాయి. అనంతరం ఈ ప్రాంగణాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ)కు అప్పగిస్తారు.
- స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) అనే విభాగం ప్రధానమంత్రి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది.
- బుధవారం రోజు అమరావతిలోని సభా ప్రాంగణం వద్ద ఎస్పీజీ విభాగం ట్రయల్ రన్ నిర్వహిస్తుంది.
- సభా ప్రాంగణానికి 8 మార్గాల నుంచి చేరుకునేలా రహదారులను సిద్ధం చేస్తున్నారు.