HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rtc Ticket Rates Changes Month By Month In Andhrapradesh According To Diesel Rates Soon

APSRTC: డీజిల్ రేటును బట్టి.. ఆర్టీసీ టిక్కెట్ రేట్లు!

తెలంగాణలో బస్ ఛార్జీలను పెంచడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆర్టీసీ ఛార్జీలను పెంచడానికి రంగం సిద్ధమైంది.

  • By Hashtag U Published Date - 07:00 PM, Fri - 17 June 22
  • daily-hunt
APSRTC
APSRTC

తెలంగాణలో బస్ ఛార్జీలను పెంచడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆర్టీసీ ఛార్జీలను పెంచడానికి రంగం సిద్ధమైంది. తెలంగాణలో డీజిల్ సెస్ రూపంలో ఛార్జీలను పెంచేశారు. దీనివల్ల రూ.9 నుంచి రూ.170 వరకు ఛార్జీలు పెరిగాయి. ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసులతోపాటు అన్ని ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ డీజిల్ సెస్సు వడ్డనకు ప్రభుత్వం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. దీనిని నెలనెలా వడ్డిస్తే ఎలా ఉంటుందన్న దిశగాను ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఏపీలో ఏప్రిల్ నెలలో డీజిల్ సెస్ ను పెంచారు. దీనివల్ల ఆర్టీసీకి రూ.720 కోట్ల అదనపు ఆదాయం సమకూరినట్టే. మళ్లీ ఇప్పుడు డీజిల్ సెస్ అంటే..అది ప్రయాణికులకు మోయలేని భారమవుతుంది. అయినా సరే అధికారులు దీనిపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. డీజిల్ ధరలు ఎప్పుడు పెరిగితే అప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం కష్టం. దానికి బదులుగా మరో విధానానికి రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది.

డీజిల్ ధరలు పెరగడం, తగ్గడాన్ని బట్టి నెలలో సగటు ధర ఎంత ఉందో ముందుగా చెక్ చేస్తారు. దానిని బేస్ చేసుకుని తరువాతి నెలలో ఆర్టీసీ ఛార్జీల్లో మార్పులు చేస్తారు. అంటే డీజిల్ రేటు పెరిగితే.. టిక్కెట్ రేటు పెరురుగుతుంది. అదే డీజిల్ ధర తగ్గితే టిక్కెట్ ధర తగ్గుతుంది. మరి దీనికి ప్రామాణికం ఉండాలి కదా అంటే.. హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ -హెచ్పీఐను ప్రామాణికంగా తీసుకుంటారు. ఆర్టీసీ ఛార్జీలను ఎప్పుడో ఓసారి పెంచడం కాకుండా.. డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులను బట్టి పెంచడం, తగ్గించడం చేస్తే ఏ సమస్యా ఉండదని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ చరిత్ర చూస్తే.. డీజిల్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. అంటే ప్రతీ నెలా ఆర్టీసీ ఛార్జీలు కూడా పెరుగుతూనే ఉండే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ విషయంలో కేంద్రం ఇదే విధానాన్ని అమలు చేసింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • apsrtc
  • diesel price
  • fares

Related News

Apsrtc

APSRTC : ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెరవేరిన కల..!

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్లను సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేర్చింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం ఆంధ్రప్రదేశ్ ప్రభ

    Latest News

    • Airlines Ticket Prices: ఇండిగో సంక్షోభం.. విమాన టికెట్ల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం!

    • Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కి సిద్ధ‌మైన హైద‌రాబాద్‌!

    • Entertainment : ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్ చరిత్రలో అతిపెద్ద డీల్

    • India Toss: భార‌త్‌- సౌతాఫ్రికా మూడో వ‌న్డే.. 20 మ్యాచ్‌ల త‌ర్వాత టాస్ గెలిచిన టీమిండియా!

    • Telangana Rising 2047 : ప్రపంచ వేదికపై సరికొత్త అధ్యాయం

    Trending News

      • Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్ అయిందా? ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకుండానే!

      • Financial Crisis: మీ అరచేతిలో భాగ్య రేఖ.. ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉంటుంది?

      • 14 Reels : అప్పుల ఊబిలో అఖండ నిర్మాతలు.. మెడకు చుట్టుకున్న ఆ 90 కోట్లు!

      • Virat Kohli Records: వైజాగ్‌లో రేపే నిర్ణయాత్మక పోరు.. కోహ్లీని ఊరిస్తున్న 3 భారీ రికార్డులీవే!

      • Akhanda 2 New Release Date : ఈరోజు రాత్రికే ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd