APSRTC Chairman Konakalla Narayana : APSRTC ప్రయాణికులకు శుభవార్త
APSRTCChairman Konakalla Narayana : కొత్త బస్సుల కొనుగోలు మరియు పథకాల అమలుపై కీలక ప్రకటనలు చేశారు. ఆర్టీసీ లో కొత్తగా 1600 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించామని, వీటిలో ఇప్పటికే 900 బస్సులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
- By Sudheer Published Date - 07:26 PM, Tue - 3 December 24

ఏపీ(AP)లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..వరుసగా ప్రజలకు గుడ్ న్యూస్ లు అందజేస్తూ వస్తుంది. ఓ పక్క ఎన్నికల హామీలను (Election Promises) నెరవేరుస్తూనే..మరోపక్క రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తూ ముందుకు వెళ్తుంది. అలాగే రాష్ట్రంలో నెలకొని ఉన్న సమస్యలపై అరా తీస్తూ వాటిని పరిష్కరిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తమ మార్క్ కనపరుస్తుంది. ఈ క్రమంలో ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపారు ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ (RTC Chairman Konakalla Narayana).
కొత్త బస్సుల కొనుగోలు మరియు పథకాల అమలుపై కీలక ప్రకటనలు చేశారు. ఆర్టీసీ లో కొత్తగా 1600 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించామని, వీటిలో ఇప్పటికే 900 బస్సులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మొత్తం 1600 బస్సుల్లో మిగిలిన 700 బస్సులు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఈ బస్సులు కొత్త మార్గాల్లో, రద్దీ ప్రాంతాల్లో నడిపి ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులకు కూడా ఈ కొత్త బస్సులు ఉపయోగకరంగా మారతాయని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సులను నడిపి ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరుస్తామని అన్నారు. ఈ కొత్త బస్సుల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించడమే తమ లక్ష్యమని కొనకళ్ల నారాయణ తెలిపారు. వీటితో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశముందని, ఈ నిర్ణయం ఆర్టీసీ ఆదాయంలో కూడా పెరుగుదల జరగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బస్సు సౌకర్యాలు, గమనాలకు సంబంధించి ప్రయాణికుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు.
అదేవిధంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు పథకాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని , ఈ పథకంపై పూర్తి అధ్యయనం చేసిన తర్వాత, తదుపరి విధివిధానాలను ప్రకటించి, అమలుకు దారితీస్తామని వివరించారు. మహిళా ప్రయాణికులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సేవల మెరుగుదలకు ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని, ప్రజల సౌకర్యమే తమ ప్రథమ ప్రాధాన్యత అని కొనకళ్ల నారాయణ తెలిపారు. బస్సు వ్యవస్థను ఆధునీకరించి, సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఈ ప్రయోజనాలను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
Read Also : BR Naidu : భక్తుల దగ్గరికి వెళ్లి సమస్యలడిగి తెలుసుకున్న TTD ఛైర్మన్ బిఆర్ నాయుడు