HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Br Naidu Sudden Inspection In Tirumala

BR Naidu : భక్తుల దగ్గరికి వెళ్లి సమస్యలడిగి తెలుసుకున్న TTD ఛైర్మన్ బిఆర్ నాయుడు

BR Naidu : క్యూలైన్‌లలో వేచి ఉన్న భక్తులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దర్శన సమయంలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు

  • Author : Sudheer Date : 03-12-2024 - 7:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Br Naidu Tirumala
Br Naidu Tirumala

TTD ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి బిఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) తన మార్క్ కనపరుస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం తో తిరుమల లో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడగా..ఇప్పుడు నాయుడు గారి ఆలోచనలు, నిర్ణయాలతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ..భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచిస్తూ వస్తున్నారు.

తాజాగా ఈరోజుతిరుమలలో శ్రీవారి దర్శన ఏర్పాట్లను పరిశీలించేందుకు టీటీడీ కొత్త చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీ (BR Naidu Sudden Inspection) చేపట్టారు. క్యూలైన్‌లలో వేచి ఉన్న భక్తులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దర్శన సమయంలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మొదట అళ్వార్ ట్యాంక్ గెస్ట్‌హౌస్ (ఏటీజీహెచ్) వద్ద గల స్లాటెడ్ సర్వ దర్శనం క్యూలైన్‌లను పరిశీలించారు. అక్కడ భక్తులతో మాట్లాడి వారు అనుభవించిన పరిస్థితులను తెలుసుకున్నారు. దర్శన సమయంలో ఎదురయ్యే అసౌకర్యాల గురించి భక్తుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్బంగా భక్తులు తమ అభిప్రాయాలను చైర్మన్‌తో పంచుకున్నారు.

అనంతరం నారాయణగిరి షెడ్లకు చేరుకుని ఫుట్‌పాత్ హాల్ (దివ్యదర్శనం) ఏర్పాట్లను పరిశీలించారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్‌లను పరిశీలించి, టీటీడీ సిబ్బంది అందిస్తున్న సేవలపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సేవల నాణ్యతను మెరుగుపరచే దిశగా తమ సూచనలను చైర్మన్‌కు వివరించారు. ఈ తనిఖీల సందర్భంగా భక్తులు టీటీడీ చర్యలపై సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శ్రీవారి లడ్డూల నాణ్యతను ప్రశంసించారు. దర్శన సమయాన్ని మరింత తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల అనుభవాలను అర్థం చేసుకున్న చైర్మన్, వీటిపై త్వరలోనే చర్చించి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీ భక్తుల విశ్వాసాన్ని పెంచింది. ఈ తనిఖీలు భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ చొరవగా ముందడుగు వేస్తున్న దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. భక్తుల సౌకర్యాలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తిరుమల దర్శనం మరింత సులభతరం కానుంది.

Read Also : CJI Sanjiv Khanna: సీఈసీ, ఈసీల ఎంపిక వ్యవహారం.. విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • br naidu
  • BR Naidu Sudden Inspection
  • tirumala
  • TTD chairman

Related News

Nara Devansh Birthday Tirum

Nara Devansh Birthday : దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా తిరుమలకు చంద్రబాబు భారీ విరాళం

నారా కుటుంబానికి మరియు తిరుమల అన్నదాన ట్రస్ట్‌కు మధ్య గత దశాబ్ద కాలంగా విడదీయలేని అనుబంధం ఉంది. ఇప్పటివరకు సుమారు 12 సార్లు వారు ఈ ట్రస్ట్‌కు భారీ విరాళాలు అందజేయడం గమనార్హం. ప్రతి శుభకార్యం వేళ శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడం

  • CM Chandrababu Naidu Inaugurates Fssai Lab

    CM Chandrababu: తిరుమలలో కల్తీ ప్రసాదాల చెక్.. FSSAI ల్యాబ్ ప్రారంభించిన చంద్రబాబు

  • Janasena Mla Donation

    Tirumala: టీటీడీకి జనసేన ఎమ్మెల్యే తనయుడు భారీ విరాళం..

  • Cbn Tirumala

    CBN : నేడు తిరుమలకు చంద్రబాబు, లోకేశ్

  • Restaurant Kitchens

    Gas Shortage : గ్యాస్ కొరతతో తిరుమలలో పలు దుకాణాలు మూసివేత!

Latest News

  • యుద్ధంపై ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌లు!

  • ఐపీఎల్ 2026.. ఉచితంగా మ్యాచ్‌లు చూసేందుకు సిద్ధమవ్వండి!

  • Madhira: మధిర కోల్డ్‌ స్టోరేజ్‌లో రెండో ఛాంబర్‌కు వ్యాపించిన మంటలు

  • Roja: తమిళ సాంగ్‌లో మాస్ స్టెప్పులతో అదరగొట్టిన రోజా!

  • Putta Sudhakar Yadav: నా కొడుకు మహేష్ కు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్

Trending News

    • Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. పడిపోతున్న బంగారం ధరలు

    • మ‌రోసారి లాక్ డౌన్ త‌ప్ప‌దా?!

    • భారీగా పెర‌గ‌నున్న ఉద్యోగుల జీతాలు?!

    • ఎల్‌పీజీపై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • Mumbai: ముంబై బీచ్‌లో వింత బిజినెస్.. చిన్న బాధలైతే రూ.250.. వెయ్యిస్తే కలిసి ఏడుస్తా..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd